జగన్ కు మద్దతు పలికిన చంద్రబాబు

వైఎస్ఆర్ కాంగ్రెస్ కు తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతోంది…అవును ఇది నిజం… శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ లోక్ సభలో పెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకాలని టీడీపీ నిర్ణయించుకోవడంతో వైసీపీకి టీడీపీ మద్దతు పలికినట్టయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టనుంది. ఈ మేరకు ఆ పార్టీ లోక్ సభ కార్యదర్శికి నోటీసులు కూడా ఇచ్చింది. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా జగన్ పలు రాజకీయపార్టీలను అభ్యర్థించారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీని కూడా తమకు మద్దతు పలకాల్సిందిగా కోరగా చంద్రబాబు దానికి అంగీకారం తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరుపోరాటం చేసినా వారికి మద్దతు పలుకుతామని చెప్పిన తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టబోతున్న అవిశ్వాసతీర్మానానికి మద్దతు ఇవ్వడం ద్వారా టీడీపీ కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోయినట్టు ప్రకటించింది. కేంద్ర మంత్రివర్గం నుండి మంత్రులను ఉపసంహరించుకున్నా ఎన్డీఏలో కొనసాగుతూ వచ్చిన టీడీపీ ఆ బంధాన్ని కూడా తెంచుకుంది. ఎన్డీఏతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్న టీడీపీ కేంద్ర ప్రభుత్వంపై ఇక పూర్తిస్థాయి పోరాటానికి సిద్ధపడుతోంది.
పవన్ కళ్యాణ్ టీడీపీపై భారీ ఎత్తున విరుచుకునిపడడం వెనుక బీజేపీ నేతలు ఉన్నారని గట్టిగా నమ్ముతున్న చంద్రబాబు నాయుడు ఇక వారితో అమీతుమీకి సిద్దపడుతున్నారు.
y.s.jagan mohan reddy, ys jagan, jagan mohan reddy, ysr congress, ycp, tdp, telugudesam pary, telugudesam, chandra babu, chandra babau naidu, babu, parliament,no confidence, congress party, cong, bjp.