ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరింత భద్రతను పెంచారు. చంద్రబాబు పాల్గొన్న సమావేశాల్లో మావోయిస్టుల కదలికలను గుర్తించిన కేంద్ర హోం శాఖ చంద్రబాబు నాయుడికి అదనపు భద్రతను కల్పించాలని నిర్ణయించింది. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద చంద్రబాబు ఉన్న సమయంలో మావోయిస్టులు రెక్కి నిర్వహించినట్టు గుర్తించారు. దీనితో పాటుగా ఉగ్రవాద కదలికల నేపధ్యంలో చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం బ్లాక్ కమెండోలు చంద్రబాబుకు రక్షణగా ఉన్నారు వీరికి తోడుగా ఎన్ ఎస్ జీ బృందం కూడా చంద్రబాబు రక్షణ విధుల్లో చేరనుంది. వీరితో పాటుగా రాష్ట్ర పోలీసులు కూడా చంద్రబాబు వెన్నంటి ఉంటారు. చంద్రబాబు నాయుడు భద్రతకు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆంద్రప్రదేశ్ పోలీసులకు సూచించింది.