మోడీ మెడలు వంచుతాం: చంద్రబాబు |modi cheated ap:babu

కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రంగా విరుచుకునిపడ్డారు. ఏపీకి నిధులు ఎట్లా రాబట్టుకోవాలో తనకు తెలుసని అన్న చంద్రబాబు కేంద్రం మెడలు వంచయినా నిధులు తీసుకుని వస్తానని అన్నారు. ప్రస్తుతం ఏపీ నిధులు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్న కేంద్రం దగ్గరి నుండి వడ్డీతో సహా వసూలు చేస్తానని ఆయన ప్రతిన బూనారు. జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ విధానాలను మరోసారి ఎండగట్టారు.
కేంద్రప్రభుత్వంతో విభేదాలు ఉంటే నిధులు రావంటూ కొంత మంచి చేస్తున్న ప్రచారాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. కేంద్రం ప్రభుత్వంతో విభేదాలు ఉన్నంత మాత్రాన అభివృద్దికి ఎటువంటి ఆటంకాలు కలవని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ది పర్చే విషయంలో ఎటువంటి రాజీలేని పోరాటం చేస్తానని బాబు స్పష్టం చేశారు.
ఏపీలో బీజేపీ నేతలు తమని తాము చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉందా అని ఆయన ప్రశ్నించారు. పక్కవారిని చూసుకుని బీజేపీ రెచ్చిపోతోందన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకోకముందు ఆ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాన్ని బీజేపీ నేతలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి బలహీనవర్గాలే అండగా ఉన్నాయని ఆయన అన్నారు.బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకుని వచ్చిన ఘనన స్వర్గీయ ఎన్టీదేనని ఆయన హయంలోనే బీసీలు బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారని అన్నారు. తెలుగుదేశం పార్టీని బలహీన వర్గాల ప్రజల తమ గుండెల్లో దాచుకున్నారని ఆయన అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో రాజీపడిందని చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎంపీల రాజీనామాల పేరుతో దొంగనాటకాలు ఆడుతున్నారని, కేంద్రంపై నిజంగా పోరాటం చేయాలనుకుంటే రాజీనామాల పేరుతో కుమ్మకు నాటకాలు కాకుండా తమ మాదిరిగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాలని సూచించారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసినట్టుగా చెప్తున్న ఆ పార్టీ ఎంపీలు ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీ సీఎం దుమ్మెత్తి పోశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పారన్నారు.
కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ఆ ఆదేశాలను పట్టించుకోకుండా కావేరీ బోర్డును ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆయన చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆయనకు ప్రజలను నమ్మించి మోసం చేయడం అలవాటేనని అన్నారు.
ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి ఎన్నికల లబ్దికోసం ప్రజల మనోభావాలతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తాను రాజీలేనిపోరాటం చేస్తానని తనకు ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక హోదాతో సమానంగా ప్రాకేజీ ఇస్తామంటే ఆనాడు దానికి సరే అన్నామని తీరా కేంద్రప్రభుత్వం మోసం చేస్తున్నదని తెలుసుకున్న తరవాత వారితో పోరాటానికి దిగామని చంద్రబాబు చెప్పారు.
ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం తరనకు లేదని, కేంద్రంతో మంచిగా ఉంటూ నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేశామని ఇప్పుడు పోరాటం ద్వారా సాధించుకుంటామని చెప్పారు. న్యాయంగా ఏపీకి రావాల్సిన వాటను తప్పుకుండా తెచ్చుకుంటామని ఇందులో మరో ప్రశ్నకు తావులేదని ఆయన తేల్చిచెప్పారు.
andhra pradesh,andhra, chandrababu naidu, narendra modi, special status, andhra pradesh special status, special status to andhra pradesh, special status to andhra pradesh, telugu desam, telugu desam party, tdp, bjp, karnataka, karnataka elections.
చంద్రబాబు
Andhra_Pradesh

_Naval_Command