ప్రజల దాహార్తిని తీరుస్తున్న చలివేంద్రాలు

క్రమంగా ఎండలు ముదురుతున్నాయి. రోడ్లపై వెళుతున్నవారికి గుక్కెడు నీరు దొరకని పరిస్థితి. ఈ నేపధ్యంలో బాటసారుల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాలు వెలుస్తున్నాయి. ఎండకాలంలో మంచినీటితో పాటుగా చలవచేసే అంబలిని ఇస్తూ బాటసారుల దాహార్తిని తీరుస్తున్నారు. ప్రధాన రోడ్లతో పాటుగా కాలనీల్లో సైతం ఇటుంటి చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. పీ అండ్ టీ కాలనీ మెయిన్ రోడ్ పై అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఉదయం నుండి రాత్రి వరకు ప్రతీ ఒక్కరికీ అంబలిని ఇస్తున్నట్టు దీన్ని ఏర్పాటు చేసిన ఉడుగు చంద్రశేఖర్ గుప్త తెలిపారు. ఎండాకాలంలో ప్రజల దాహాన్ని తీర్చడం కోసం ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. గత సంవత్సరం కూడా ఇదేతరహాలో అంబలి పంపిణీ కేంద్రాన్ని నిర్వహించామని ప్రజలు పెద్ద సంఖ్యలో కేంద్రానికి వచ్చి దాహాన్ని తీర్చుకోవడంతో ఈ సంవత్సరం కూడా ఈ కేంద్రాన్ని ప్రారంభించామని ఆయన చెప్పారు.
దిల్ షుఖ్ నగర్ లోని ప్రగతీ నగర్ లో కూడా చలివేంద్రం ఏర్పాటయింది. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండి సత్యనారాయణ తన నివాసం వద్ద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక కార్పేరేటర్ భవానీ ప్రవీణ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనన్నారు రోజురోజుకీ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో ప్రజలు వడదెబ్బబారిన పడకుండా ఇటుంటి కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. తన ఇంట్లోనే ప్రజలకు ఉపయోగకరంగా ఉండేందుకు పఠనాలయాన్ని ఏర్పాటు చేశామని ఇదే క్రమంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు బండిసత్యనారాయణ చెప్పారు.

telangana, dilsukhnagar,p&t Colony, p&t colony, pragathi nagar, bhavani praveen, chalivendram, hyderabad, water, people distributing water,drinking water