నల్గొండ అసెంబ్లీ అభ్యర్థిని మార్చాలి-చకిలం అనీల్ వర్గీయుల డిమాండ్

chakilam anil kumar నల్గొండ అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డికి ఇవ్వడం పై టీఆర్ఎస్ నేత చకిలం అనీల్ కుమార్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టిని నమ్ముకుని ఉన్న తమ నేతను కాదని మరోకరికి టికెట్ ఇవ్వడం సరికాదని చలిలం వర్గీయులు అంటున్నారు. నియోజకవర్గంలో గట్టి పట్టున్న చకిలం అనీల్ కుమార్ కు పార్టీ అన్యాయం చేసిందనేది ఆయన వర్గీయుల వాదన. గత ఎన్నికల్లోనే పార్టీ టికెట్ ఆశించిన చకిలం కు రాజకీయ సమీకరణాల నేపధ్యంలో టికెట్ దక్కలేదు. ఇప్పుడు కూడా టికెట్ రాకపోవడంతో నియోజకవర్గంలో చలికం ఈ దఫా అమీతుమికి సిద్ధమవుతున్నారు.
టీఆర్ఎస్ పార్టీ టికెట్ లభించకపోయినా ఈసారి మాత్రం పోటీ చేయాలనే అలోచనలో ఉన్న చలికం అనీల్ కుమార్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నేరు ఓటర్లను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. గ్రామస్థులతో ఉన్న పరిచయంతో చకిలం చేస్తన్న ప్రచారం ఇటు పార్టీ అధికారికంగా టికెట్ ప్రకటించిన కంచర్ల భూపాల్ రెడ్డి వర్గీయులను ఆత్మరక్షణలోకి నెడుతోంది.
తెలంగాణ ఉధ్యమసమయంలో చలిలం అనీల్ కుమార్ నాటి నల్గొండ జిల్లాలోని గ్రామగ్రమాల్లో పర్యటించారని పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పార్టీని నిలబెడితే ఇప్పుడు ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకులు టికెట్లు తన్నుకునిపోతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో టీఆర్ఎస్ దిమ్మెలను సైతం అనీల్ కుమార్ దగ్గరుండి కట్టించారని అటువంటి నేతకు ఇప్పుడు టికెట్ ఇవ్వకుండా మొఖం చాటేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ అనుక్షణం పార్టీకోసం కష్టపడిన వారికి కాకుండా ఇతరులకు టికెట్ ఇవ్వడం సరికాదని వారంటున్నారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకుని వెంటనే పార్టీ అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని చకిలం వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.
గత ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇక్కడి నుండి గెలుపొందారు. నాడు పొత్తుల్లో భాగంగా నల్గొండ సీటును తెలుగుదేశం పార్టీ బీజేపీకి కేటాయించడంతో టీడీపీ నేత కంచర్ల ఇండిపెండెట్ గా పోటీచేసి రెండో స్థానంలో నిల్చారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన దుబ్బాక నర్సింహ్మారెడ్డి మూడో స్థానానికే పరిమితం అయింది. అటు తరువాత కంచర్ల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
chakilam anil kumar, chakilam anil kumar trs, nalgonda trs leader chakilam anil kumar.
టీఆర్ఎస్ కు ఓటమీ భయం పట్టుకుంది : అమిత్ షా