పెన్ డ్రైవ్ లో చాగంటి ప్రవచనాలు

“శ్రీ గురువాణి” సంస్థ పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనములను CD/DVD రూపములలో ప్రజలకు అనువైన వెలలో అందిస్తున్న సంగతి అందరికీ విదితమే. పూజ్య గురువుగారి ప్రవచనాలు అందరికీ అందాలనీ, వాటిని ఎవ్వరూ తమ తమ స్వార్థ ప్రయోజనాలకు వాడి దుర్వినియోగపరచకుండా, చట్టపరమైన రీతిలో ఒక సంస్థ ఏర్పాటు చేసి, ప్రవచనములను CD/DVD రూపములో అందించి, ప్రభుత్వమునకు తగు పన్నులు చెల్లిస్తూ, ఆ పైన మిగిలిన కొద్దిపాటి డబ్బుతో వైదికమైన, సమాజోపకరమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తుండటమే ఈ సంస్థ లక్ష్యము, ఈ సంస్థ చేస్తున్న కార్యము.
ఈ క్రమములో, ప్రస్తుతము మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారి అభిమానులు గత కొంతకాలంగా కోరుతున్న మీదట ప్రవచనములను “pen drive” గా అందిస్తే పూజ్య గురువుల ప్రవచనాలను pendrive ద్వారా వినాలనుకునేవారి ఆసక్తికి అనుగుణంగానూ మరింత ఉపయుక్తముగానూ ఉంటుందని భావించి, “శ్రీ గురువాణి” సంస్థ శ్రీ విళంబి నామ సంవత్సర చైత్ర పౌర్ణమి (ది: 31-03-2018) నాడు కాకినాడలోని శ్రీ ఆకొండి లక్ష్మీ స్మారక గోశాలయందు పూజ్య గురువుల “ప్రవచన అమృతలహరి” పరంపరను (pendriveల రూపములో) ఆవిష్కరించటము జరిగినది.
పూజ్య గురువుల అనుంగు శిష్యుడు, అకుంఠిత దీక్షా తర్పరులు, పూజ్య గురువుల శిష్యులందరికీ సుపరిచితులు, గురువుగారి అడుగుజాడలలో ఎన్నో వైదిక కార్యక్రమాలను తమ చేతులమీదుగా నిర్వహించిన గొప్ప వ్యక్తి “శ్రీ గోపలకృష్ణ”గారి చేతుల మీదుగా ఈ “ప్రవచన అమృతలహరి” ఆవిష్కరింపబడుట, ఈ కార్యక్రమానికి మరింత శోభ చేకూర్చింది.
శ్రీ గురువాణి అధ్యక్షులు శ్రీ రాఘవేంద్ర రావు గారు, కార్యదర్శి శ్రీ శివ శంకర్ గారు మరియు ఇతర సంస్థ సభ్యులు ఈ కార్యక్రమములో పాల్గొని, గోశాలలో జరుగుతున్న “త్రయాహ్నిక కదళీవనాంతర్గత శ్రీ హనుమదారాధనోత్సవముల” సందర్భముగా ఆంజనేయ స్వామికి శ్రీ గురువాణి తరపున భక్తితో ముత్యముల హారము సమర్పించటము జరిగినది.
శ్రీ గురువాణి “ప్రవచన అమృత లహరి” పరంపర వివరములు:
1. ప్రవచన అమృత లహరి-1: శ్రీ రామ కథామృతము
(సంపూర్ణ శ్రీమద్రామాయణము, శ్రీరామచంద్రమూర్తి కి సంబంధించిన మరికొన్ని ప్రవచనములు)
2. ప్రవచన అమృత లహరి-2: శ్రీ కృష్ణ కథామృతము
(శ్రీమద్భాగవతము, శ్రీకృష్ణునకు సంబంధించిన మరికొన్ని ప్రవచనములు)
3. ప్రవచన అమృత లహరి-3: శ్రీ పరమేశ్వర వైభవము
(శివ మహా పురాణము, పరమేశ్వరునికి సంబంధించిన మరికొన్ని ప్రవచనములు)
4. ప్రవచన అమృత లహరి-4: శ్రీ మాతా విలాసము
(లలితా సహస్రము, అమ్మవారికి సంబంధించిన మరికొన్ని ప్రవచనములు)
USB Make: Sony
Capacity : 8GB
వీటిని ఈ క్రింది వెబ్సైటు నుండి కొనుగోలు చేసుకోవచ్చును:
https://sriguruvaani.net/
Note/ గమనిక: DVDలు కూడా అందుబాటులోనే ఉన్నవి, DVD ఫార్మాటులో కావాలసినవారు వాటిని ఇప్పటిలాగే మా సంస్థనుంచి పొందవచ్చు.


గురువాణి