రోహింగ్యాలకు త్రీవవాదులతో సంబందాలు:కేంద్రం

0
3

రోహింగ్యా ముస్లింలు దేశ అంతరంగ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు ఒక నివేదికను సమర్పించింది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు అందచేసింది.అక్రమంగా దేశంలోకి వచ్చిన రోహింగ్యాలను తిప్పి పంపాల్సిందేనని కేంద్ర స్పష్టం చేసింది. వారి వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. దేశంలోకి చొరబడడంతో పాటుగా నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా దేశ పౌరుగులు చలామణి అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పేర్గొంది. రోహింగ్యాలు కొన్ని చోట్లు ఉద్రవాద సంస్థల తరపున చురుగ్గా పనిచేస్తున్నట్టు వెల్లడించింది. వారికి పాకిస్థాన్ ఐఎస్ఐ, ఇస్లామికి స్టేట్ ఉగ్రవాదులతో సంబందాలు ఉన్నట్టు సమాచారం ఉన్నట్టు కేంద్రం తన నివేదికలో పేర్కొంది. రోహింగ్యాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఢిల్ల, హైదరాబాద్, మేవార్, జమ్ము తదితర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here