రోడ్డెక్కిన సీబీఐటి విద్యార్థులు

గండిపేటలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల సీబీఐటి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఒక్కసారిగా పరీక్షల ఫీజులను పెంచుతూ సీబీఐటి యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రోడెక్కారు. ప్రస్తుతం 1.13 లక్షలుగా ఉన్న ఫీజును 2 లక్షల రూపాయలకు పెంచడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా ఫీజులను భారీ ఎత్తున పెంచడం సరికాదని వారంటున్నారు. ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డపై బైఠాయించడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిల్చిపోయాయి. విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఫీజులను ఒక్కసారిగా పెంచిన యజమాన్యంపై విద్యార్థులు మండిపడతున్నారు. వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక్కసారిగా ఫీజులను భారీ ఎత్తున పెంచడంతో తమ చదువులు ఆగిపోయేలాగా ఉన్నాయని విద్యార్థులు అంటున్నారు. మొదటి రెండవ సంవత్సరం ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతి ఇస్తామంటూ యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని విద్యార్థులు అంటున్నారు. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించాలంటూ డిమాండ్ చేయడం సరికాదని వారంటున్నారు.
అయితే కళాశాల వాదన మరో రకంగా ఉంది. ఫీజులు పెంచుతామని తాము ముందుగానే విద్యార్థులకు చెప్పామని అంటున్నారు. దీనిపై కౌన్సిలింగ్ సమయంలోనే వారికి స్పష్టం చేశామని చెప్తున్నారు. కళాశాలలో సౌకర్యాలను పెంచడం కోసం ఫీజులు పెంచక తప్పడం లేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే ఫీజులను పెంచామని సీబీఐటి ప్రిన్సిపకల్ రవీందర్ రెడ్డి చెప్తున్నారు. ముందుగానే విద్యార్థులకు దీనిపై సమాచారం ఇచ్చినా కొంత మంది ఉద్దేశపూర్వకంగానే గొడవ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *