కెనడా లోనూ భారతీయులకు తప్పని బెదిరింపులు

0
71
కెనడా

మొన్న ఆస్ట్రేలియా…నిన్న అమెరికా… నేడు కెనడా లోనూ భారతీయులకు జాత్యంహంకార బెదిరింపులు తప్పడం లేదు. కెనడా నుండి వెళ్లిపోవాలని లేకుంటే మీ పిల్లలను చంపేస్తానంటూ ఓ కెనడియన్ స్థానిక భారతీయ జంటను బెదిరింపులకు గురిచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక పత్రిక కథనం ప్రకారం ఓ సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేసి బయటికి వచ్చిన భారతీయ జంటకు, 47 సంవత్సరాల కెనడియన్ కు మధ్య పార్కింగ్ స్థలంలో వివాదం రేగింది. ట్రక్ నిర్లక్ష్యంగా నడపడంతో అది భారతీయ మూలాలున్న మహిళకు తగిలింది. ట్రక్ ను నిర్లక్ష్యంగా నడపమేకాకుండా ఇదే మని ప్రశ్నించిన భారతీయ జంటపై సదరు వ్యక్తి బెదిరింపులకు దిగాడు.
మీరు కెనడా నుండి వెళ్లిపోవాలంటూ అరవడంతో పాటుగా ఇక్కడే ఉంటే మీ పిల్లలను చంపేస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. “మీరు నాకు నచ్చలేదు మీ దేశానికి వెళ్లి పోండి” అంటూ విద్వేషపు వ్యాఖ్యలు చేసినట్టు భారతీయ జంట పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడిని డేల్‌ రాబర్ట్‌సన్‌ గా గుర్తించారు. భారతీయులంటే తనకు ఇష్టం లేదని వారు ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. దీనితో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
భారత్ నుండి ఎనిమిది సంవత్సరాల క్రితం కెనడాకు వెళ్లిన ఈజంటకు ఆదేశపు పౌరసత్వం కూడా ఉంది. తాము కూడా కెనడా వాసులమేనని వారు ఎంతచెప్పినా నిందితుడు వారి మాటను ఏమాత్రం ఖాతరు చేయకుండా వారితో వాగ్వాదానికి దిగడంతో పాటుగా జాత్యంహంకార వ్యాఖ్యలు చేసినట్టు బాధితులు చెప్తున్నారు.
Canada, Canada visa, racism in Canada.

ప్రభుత్వ ఉద్యోగాలు | government jobsCanada

Wanna Share it with loved ones?