ఫిబ్రవరి నాలుగున మేగా ఎగ్జిబిషన్

0
66

బ్రాహ్మణ వ్యాపారులు, తయారీదారులను ప్రోత్సహించేందుకు గాను ‘బ్రాహ్మిన్ ఆర్గైజేషన్ ఫర్ యూత్ సర్వీసెస్’ సంస్థ ఫిబ్రవరి నాల్గవతేదీన మారుతీనగర్ లో మేగా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది. న్యూ మారుతీనగర్ లో ఆఖరి బస్టాస్ వద్ద ఉన్న భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ భవనంలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్టు నిర్వహాకులు వెల్లడించారు. ఉదయం 9.00 గంటల నుండి రాత్రి 8.00 వరకు ప్రదర్శన కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. ప్రత్యేక తగ్గింపు ధరలతో వివిధ రకాల వస్తువులను ఇందులో అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు.
సుమారు 70 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు వారు వివరించారు. వివిధ రకాల ఉత్పత్తులు ఇందులో ఉంటాయని చెప్పారు. ఎగ్జిబిషన్ రోజును స్టార్ హెల్త్ గ్రూప్ వారి సహకారంతో ఉచిత వైద్య శిభిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వారు వివరించారు. ఇతర వివరాల కోసం 9676684787,9133290543 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని చెప్పారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం తమ సంస్థ పాటుపడుతోందని ఇందుకోసం గాను పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్టాళ్ల ను పూర్తిగా ఉచితంగా కేటాయిస్తున్నట్టు వారు వివరించారు.Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here