బీబీఎన్ నూతన కార్యవవర్గం ఏర్పాటు | bbn executive committee formed

బ్రాహ్మణ వ్యాపారుల పరస్పర సహకారం కోసం ఏర్పాటయిన బ్రాహ్మిన్ బిజినెస్ నెట్ వర్క్ (బీబీఎన్) కార్యవర్గం ఏర్పాటయింది. ఆదివారం ఉదయం హబ్సీగూడాలోని సుప్రభాత్ హోటల్ లో బీబీఎన్ తొలి కార్యవర్గాన్ని ప్రకటించారు. బ్రాహ్మిన్ బిజినెస్ నెట్ వర్క్ కు ఛైర్మన్ గా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రప్రతినిధి, బ్రాహ్మణ పరిషత్ సభ్యుడు సముద్రాల వేణుగోపాలచారి వ్యవహరిస్తున్నారు. బీబీఎన్ నూతన కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు.
అధ్యక్షులు – నారాయణ కరణం
ఉపాధ్యక్షుడులు -కే.వి.ఎన్.రావు
ప్రధాన కార్యదర్శి- డి.సుధాకర్ శర్మ
సహాయ కార్యదర్శి- రాజ్యలక్ష్మి వట్టెం
కోశాధికారి- విష్ణు అవసరాల
సహాయ కోశాధికారు- స్వాతి లు ఉండగా కార్యనిర్వహాక సభ్యులుగా
సి.వి.రమణ్
సి.వేంకటేశ్వర శర్మ
స్వాతి
చతుర్వేది
అమృత్
పవన్ లు బాద్యతలు నిర్వహించనున్నారు.
న్యాయ సలహా దారుడిగా జే.ఎల్.ఎన్ మూర్తి
విదేశీ వ్యవహారాల బాధ్యతలు అమృత్ నిర్వహిస్తారు.
మీడియా/ పీఆర్ బాధ్యతలను రమా విశ్వనాధన్, బి.వి.ఎల్.కే.మనోహర్, ఉజ్వల్, మాడభూషి లు నిర్వహించున్నారు.
మెంబర్ షిప్ కమిటీ సభ్యులుగా సుధాకర్ శర్మ, సి.వి.రామన్,శ్రీధర్ భద్రంలు బాధ్యతలు స్వీకరించారు.
నూతన కార్యవర్గం ఏర్పాటయిన సందర్భంగా బ్రాహ్మిన్ బిజినెస్ నెట్ వర్క్ అధ్యక్షులు నారాయణ కరణం మాట్లాడుతూ బ్రాహ్మణ వ్యాపారుల పరస్పర సహారం కోసం దీన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బ్రాహ్మణ పరిషత్ ప్రముఖుల ఆశీర్వాదంతో ఏర్పాయిటిన బీబీఎన్ ప్రతీ ఆదివారం సమావేశాలు నిర్వహించుకుని సభ్యుల మధ్య వ్యాపారం మరింత అభివృద్ది చెందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. బ్రాహ్మిన్ బిజినెస్ నెట్ వర్క్ను మరింత విస్తృతపర్చనున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణవ్యాపారుల మధ్య అనుసంధాన పాత్రను పోషిస్తుందన్నారు.
వ్యాపారులు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఆర్థికంగా మరింత ఉన్నతంగా ఎదగాడానికి ఈ సంఘం తోడ్పడుతుందన్నారు. వ్యాపారంలోని ప్రముఖులతో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటుగా మార్కెట్ వస్తున్న మార్పులను గురించి సభ్యులకు ఎప్పటికప్పుడు అవహాన కల్పిస్తామన్నారు. బ్రాహ్మిన్ బిజినెస్ నెట్ వర్క్ కు సేవచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతులు తెలపిన నారాయణ కరణం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం గౌరవంగా ఉందని బాధ్యతాయుతంగా తన పదవిని నిర్వహిస్తానని చెప్పారు.
బీబీఎన్ ఉపాధ్యక్షులు కే.వీ.ఎన్.రావు వివిధానాలను వివరించారు. బీబీఎన్ రానున్న కాలంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉండనుందని వాటినన్నింటిని దృష్టిలో పెట్టుకుని విధివిధానాలను రూపొందించినట్టు చెప్పారు. సభ్యులు పాటించాల్సిన నియమాలను ఆయన పేర్కొన్నారు.
ఒక మంచి ఆశయంతో ప్రారంభమైన బీబీఎన్ ఉన్నత స్థాయికి తప్పకుండా ఎదుగుతుందని దీనికోసం విధానాల రూపకల్పనలో కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు బీబీఎన్ ప్రధానకార్యదర్శి సుధాకర్ శర్మ తెలిపారు. సభ్యులు పరస్పరం సహకరించుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
సభ్యుల మధ్య జరిగే ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు రాకుండా ఉండేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు బీబీఎన్ విధివిధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన సీ.వీ.రమణ్ తెలిపారు. ఇందులోని ప్రతీ సభ్యుడు ఆర్థికంగా లాభపడడంతో పాటుగా తన తోటివారిని చేయూతను అందించే విధంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఆయన సూచించారు. దీర్ఘకాలికి ప్రయోజనాలను దృష్టిపెట్టుకుని ప్రతీ ఒక్కరూ వ్యాపారం నిర్వహించాలని సభ్యులకు ఎటువంటి సహాయం చేయడానికైనా బీబీఎన్ కోర్ టీం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.
brahmin business network, bbn, narayana karanam, venugopala charry

వ్యాపారులకు ఓ వేదిక
Business_networking

photo courtesy: UGWAL