సీఎం ను కలుస్తాం-భయం వద్దు : బ్రాహ్మణ సంక్షేమ పరిషత్

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా అమలవుతున్న పథకాల అమలు విషయంలో బ్రాహ్మణులు ఎవరూ ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పరిషత్ స్పష్టం చేసింది. బొగ్గులకుంట లోని పరిషత్ కార్యాలయంలో మంగళవారం అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో చర్చించిన అంశాలను సంస్థ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ కే.వీ.రమణాచారి మీడియాకు వివరించారు.
త్వరలోనే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు చెందిన సభ్యుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నట్టు ఆయన తెలిపారు. వివిధ పథకాలతో పాటుగా వాటి అమలుకు సంబంధించి ముఖ్యమంత్రికి అన్ని వివరాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. బ్రాహ్మణ వ్యాపారులకు రుణాలతో పాటుగా విదేశీ విద్యకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రికి క్షుణ్ణంగా వివరిస్తామని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఈ పథకాల అమలులో పురోగతి లేనందున వీటని మరోసారి సమీక్షించాలని ముఖ్యమంత్రిని కోరాతామన్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా ఆయన దగ్గర నుండి సానుకూల నిర్ణయం వస్తుందని పరిషత్ భావిస్తోందన్నారు. బ్రాహ్మణ పరిషత్ కు సంబంధించిన పథకాల అమలుపై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో పరిషత్ ద్వారా మంజూరు పత్రాలను అందుకున్న 155 మంది లబ్దిదారులకు రుణాలు అందేలా చూస్తామన్నారు.
ఇప్పటికే రుణాలు మంజూరు అయిన వారు పడుతున్న ఆందోళన తమ దృష్టికి వచ్చిందని రమణాచారి చెప్పారు. రుణాలు మంజూరైనా నిధులు విడుదల కాకపోవడం వల్ల వారు పడుతున్న ఆవేదనను సభ్యలు సమావేశంలో ప్రస్తావించారని వారి ఆందోళనను అర్థం చేసుకుంటామన్నారు. ఈ విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.
బ్రాహ్మణులకు ఉపనయనం అనేది అత్యంతకీలకమని ఉపనయనం చేయించుకునే స్థోమత లేని పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఉపనయనాలు చేయిస్తున్న సంస్థలకు ఆర్థిక సహకారం అందించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నట్టు డాక్టర్ కే.వీ. రమణాచారీ తెలిపారు. ప్రస్తుతం బలహీన వర్గాలకు అందిస్తున్న విధంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించే విషయంలో కూడా సీఎం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు.
ఐఏఎస్,ఐపీఎస్ సహా వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి శిక్షణ నివ్వడంకోసం స్టడీ స్కరిళ్ల ఏర్పాటుపై ప్రభుత్వ సహకారంతో నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాద్ లో బ్రాహ్మణ భవన్ తో పాటుగా జిల్లాల వారిగా సదనాల ఏర్పాటు పై కూడా గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరాతామన్నారు.
బ్రాహ్మణ సంక్షేమ సంఘం పథకాల అమలుకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిషత్ భరోసా ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఆమోదించిన మూడు పథకాల్లో ముఖ్యమయిన వివేకానంద విదేశీ విద్యా పథకంలో  ఎంపికైన వారందరికీ త్వరలో ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది.వెనువెంటనే 18 మందికి ఆన్‌లైన్‌పేమెంట్లు జరిగేలా చర్యలు తీసుకుంది.
పరిషత్తు అధ్యక్షులు డా.కె.వి.రమణాచారి గారి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డా.సముద్రాల వేణుగోపాల చారి, సి. ఎల్.రాజం, వేలేటి మృత్యుంజయశర్మ, జోషిగోపాల శర్మ, మరుమాముల వెంకటరమణశర్మ,అష్టకాల రామ్మోహన్‌,సుమలతా శర్మ, సువర్ణసులోచన, భద్రకాళిశేషు,
బోర్బట్ల హనుమంతాచారి,పరిషత్ సభ్య కార్యదర్శి శివశంకర్‌,అడ్మినిస్ట్రేటర్ రఘురామ శర్మ పాల్గొన్నారు. 
contact us: b.v.l.k.manohar
Email: telanganaheadlines@gmail.com
brahmana parishad, dr.k.v.ramana chary, dr sumudrala


బ్రాహ్మణ వ్యాపారులు
brahmin