బ్రాహ్మణ పరిషత్ జాబ్ మేళా వాయిదా

brahmana parishad బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన జాబ్ మేళాను వాయిదా వేస్తున్నట్టు పరిషత్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందువల్ల ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు పరిషత్ అధ్యక్షుడు రమణా చారి తెలిపారు. సెప్టెంబర్ 30వ తేదీన జాబ్ మేళాను నిర్వహించడానికి సన్నాహాలు చేశామని దీనికోసం గాను విస్తృతంగా ప్రచారం నిర్వహించామని ఆయన తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ అమ్మల్లోకి వచ్చినందున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమం వాయిదా పడిందని ఎవరూ బ్రాహ్మణ పరిషత్ కార్యాలయానికి రావద్దని ఆయన కోరారు. తిరిగి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించేది ఎన్నికల తరువాత ప్రకటిస్తామన్నారు.
కిడారి కుటుంబానికి కోటిరూపాయల ఎక్స్ గ్రేషియా