బ్రహ్మణులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి:వేణుగోపాల చారి

0
62

ఆదివారం మల్కాజ్ గిరిలోని ఆనంద్ బాగ్ లోని బృందావన్ గార్డెన్స్ లో బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ యూత్ సర్వీసెస్ (బాయ్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిబిషన్, జాబ్ మేళా,ఉచిత ఆరోగ్య శిభిరాలు విజయవంతం అయ్యాయి. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి ఈ కార్యక్రమాలను ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణుల అభివృద్దికి కట్టుబడి ఉందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను బ్రాహ్మణులు అందిపుచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణ పరిషత్ ను ఏర్పాటు చేయడంతో పాటుగా దానికి వంద కోట్ల రూపాయలను టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. చిరు వ్యాపారులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బ్రాహ్మణ వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రంలో సుమారు 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించడంతో అమ్మకాలు సాగించారు. స్టాళ్లను ఏర్పాటు చేసిన వారికి ఎటువంటి ఇబ్బందులో లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్టాళ్ల కేటాయింపును పర్యవేక్షించిన లక్ష్మీకాంత్, పూర్ణిమలు ప్రతీ స్టాల్ నిర్వాహకుల వద్దకు వచ్చి ఏర్పాట్లను గురించి ఆరాతీశారు. స్టాల్స్ నిర్వహిస్తున్న వారికి మద్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా చేయడం పట్ల స్టాళ్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉచిత వైధ్యశిబిరాన్ని స్టార్ హెల్త్ సహకారంతో నిర్వహించారు. పిల్లలకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. సాయంత్ర లలిత, విష్ణు సహస్రనామ పఠనం జరిగింది.
అంతకుముందు వేణుగోపాల చారి ప్రతీ స్టాల్ వద్దకు వచ్చి వారు నిర్వహించే వ్యాపారం గురించి అడిగితెలుసుకున్నారు. వ్యాపార నిర్వహణ కోసం బ్రాహ్మణ పరిషత్ చేస్తున్న సహాయాన్ని ఓపిగ్గా ప్రతీ ఒక్కరికీ వివరించి పథకాల ద్వారా లబ్దిపొందాలని సూచించారు.
బ్రాహ్మణ వ్యాపారుల లబ్దికోసం కార్యక్రమాన్ని నిర్వహించిన మల్లాది చంద్రమౌళి, లక్ష్మీకాంత్,పూర్ణిమలను పలువురు అభినందించారు. బ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలు నాగకుమారి, బ్రాహ్మణ పరిషత్ సభ్యురాలు డాక్టర్ సులోచని, ప్రభు, శ్రీనివాస్, పవన్ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here