ఎస్కలేటర్లపై పిల్లలతో జాగ్రత్త….!

0
69షాపింగ్ మాల్ లో ఆడుకుంటూ ఎస్కలేటర్ పై నుండి పడి బాలుడికి తీవ్ర గాయాలైన ఘటన కాచిగూడలో జరిగింది. దిల్ షుఖ్ నగర్ కు చెందిన మూడు సంవత్సరాల అభిరాల్ కాచిగూడలోని బిగ్ బజార్ షాపింగ్ మాల్ లో రైడర్ కారుతో ఆడుకుండూ ఎస్కలేటర్ పైకి వెళ్లాడు. ఒక్కసారిగా అక్కడి నుండి జారిపడడంతో బాలుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. హుటాహుటిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. షాపింగ్ మాల్స్ లో ఎస్కలేటర్ల వద్ద పిల్లలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. ఎస్కలేటర్ల వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, చిన్న ఏమరుపాటు అనార్థాలకు దారి తీస్తుంది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది.
Photo Courtesy: face book page of ramesh vitla

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here