గుప్త నిధులు దొరుకుతాయని చిన్నారి బలి

0
71

తలపై మూడు సుడులు ఉండడం ఆ చిన్నారి పాలిట శాపంగా మారింది. మూడు సుడులు ఉన్న చిన్న పిల్లవాడిని బలిస్తే గుప్త నిధులు దొరుకుతాయనే మూఢనమ్మకంతో 2 సంవత్సరాల చిన్నారిని హతమార్చారు ఇద్దురు కిరాతకులు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రాలోని చంద్రపూర్ జిల్లా, బ్రహ్మపురి తాలూకా కందాడ గ్రామంలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం స్థానికంగా నివాసం ఉండే అశోక్ మెశ్రమ్ కు ఇద్దరు కుమారులు. అందులో చిన్న వాడు రెండు సంవత్సరాల యోగ్ మిశ్రమ్ ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు.అతని కోసం అన్ని చోట్లా వెతికిన తరువాత తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ మొదలు పెట్టారు. బాలుడు ఇంటి ముందే ఆడుకుంటున్నట్టు స్థానికులు చెప్పడం, అదే గ్రామానికి చెందిన ఇద్దరు సునీ బన్ కర్, ప్రమోద్ బన్ కర్ లు అటుగా వచ్చారంటూ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు లోతుగా విచారించిన పోలీసులకు విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి.
హర్ష తలపై మూడు సుడులు ఉండడంతో అటువంటి పిల్లవాడిని బలిస్తే గుప్తనిధులు సొంతం అవుతాయనే మూఢనమ్మకంతో బాలుడిని తామే హత్యచేసినట్టు ఇద్దరు నిందితులు అంగీకరించారు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని అపహరించిన తరువాత క్షుద్ర పూజలు చేశామని దాని తరువాత చిన్నారిని గొంతునులిమి హత్యచేసినట్టు వారు అంగీకరించారు. మృతదేహాన్ని ముందుగా స్థానిక నదిలో పారవేయాలని అనుకున్నప్పటికీ అప్పటికే తెల్లవారిపోవడంతో కుదరలేదని నిందితుల్లోని ఒకరి ఇంటి వెనుక భాగంలో మృతదేహాన్ని పూడ్చినట్టు వారు వెల్లడించారు.
మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత ప్రగతిని సాధించినప్పటికీ మూఢనమ్మకాలు మాత్రం ఇంకా ప్రజలను వీడడంలేదనే విషయం మరోసారి బయటపడింది.

తెలంగాణలో కొత్త జోన్లు ఇవే | new zones in telangana


పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Wanna Share it with loved ones?