దుబాయ్ పోలీసుల అదుపులో శ్రీదేవి భర్త బోనీ కపూర్?

0
70

సినీనటి శ్రీదేవి మరణానికి సంబంధించి అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత శ్రీదేవి గుండెపోటుతో మరణించారని వార్తలు రాగా పోస్టు మార్టం నివేదిక మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. హోటల్ గదిలోని బాత్ టబ్ లో పడి శ్రీదేవి మరణించిందని దుబాయి పోలీసులు తమ ఫొరెన్సిక్ నివేధికలో పేర్కొన్నారు. శ్రీదేవి చనిపోవడానికి ముందు మధ్యం మత్తులో ఉన్నట్టు కూడా ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే శ్రీదేవికి మధ్యం సేవించే అలవాటు లేదని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. శ్రీదేవికి సన్నిహితుడు, రాజకీయ నాయకుడు అమర్ సింగ్ ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. శ్రీదేవికి మధ్యం తాగే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. మరి ఆమె ఎలా చనిపోయిందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. శ్రీదేవి మరణానికి సంబంధించి మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని దుబాయి పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీని వల్లే ఆమె మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
ఈ కేసుకు సబంధించి ఒక నిర్ణయం తీసుకునే వరకు శ్రీదేవి భర్త బోనీ కపూర్ ను దుబాయ్ విడిచి వెళ్లదారని సైతం దుబాయ్ పోలీసులు ఆదేశించినట్టు తెలుస్తోంది. బోనీ కపూర్ ను పూర్తిగా పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అటు హోటల్ సిబ్బందిని కూడా దుబాయ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్ తరలించే విషయంలో దుబాయ్ లోని భారత కాన్సోలెట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఆశించిన మేరకు ఫలితాలను ఇవ్వడం లేదు.
శ్రీదేవి దంపతులు బసచేసిన హోటల్ గదిని దుబాయి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఏఒక్క ఆధారాన్ని వదిలిపెట్టకుండా గదిలోని అణువణువు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి కొంత అనుమానం వచ్చిఉంటుందని అందుకే తిరిగి కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here