విజయవాడ పడవ ప్రమాదంలో 20కి చేరిన మృతుల సంఖ్య

విజయవాడ వద్ద ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరుకుంది. ఆదివారం నాడు 16 మృతదేహాలను వెలికితీయగా సోమవారం నాడు మరో నాలుగు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. సోమవారం నాడు వెలికితీసిన మృతదేహాల్లో పడవ డ్రైవర్ ది కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. చనిపోయి వారిలో 17 మంది ఒంగోలు చెందిన వారుగా అధికారలు గుర్తించారు. వీరంతా ఒంగోలు వాకర్స్ క్లబ్ కు చెందిన సభ్యులు. స్థానిక రంగారాయుడి చెరువు వద్ద వాకింగ్ చేసే వీరంతా కార్తిక మాస విహార యాత్రలో భాగంగా విజయవాడకు వచ్చారు. అనేక పర్యాటక ప్రాంతాల్లో విహరించిన వీరు గోదావరి, కృష్ణ ల సంగమ ప్రదేశానికి వెళ్లె క్రమంలో వీరు ఎక్కిన పడవ బోల్తా పడడంతో వీరి విహార యాత్ర కాస్తా విషాధ యాత్ర గా మారింది. మృతులలో అత్యధికులు ఒంగోలు పట్టణానికే చెందిన వారు కావడంతో అక్కడ విషాధ ఛాయలు అలముకున్నాయి.
మరో వైపు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అధికారులు అలక్ష్యంతో పాటుగా కాసులకోసం కక్కూర్తి పడడమే ప్రమాదానికి అసలు కారణంగా తెలుస్తోంది. ఎటువంటి అనుమతులు లేకుండా పరిమితికి మించి ప్రయాణికులతో తిరుగుతున్న బోటును పర్యాటక శాఖ అధికారులు చూసి చూడనట్టు వదిలివేయడంతో ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదాకానికి కాణమైన బోటు నిర్వహణ సంస్థలో పర్యాటక శాఖ అధికారులకు వాటాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రమాదానికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను కూడా వదిలేది లేదని అన్నారు. ఇప్పటికే ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేసినట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *