పడవ ప్రమాదం లో మృతులు 22 మంది

0
58
పడవ ప్రమాదం
boat accident in godavari andhra pradesh

తూర్పు,పశ్చిగోదావరిల సరిహద్దుల్లో గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదం లో 22 మంది మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు. దోవీపట్నం మండలం మంటూరు వద్ద మంగళవారం లాంచీ గోదవరి నదిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తొలుత 50 మందికి పైగా గల్లంతైనట్టు వార్తలు వచ్చినప్పటికి వాస్తవానికి 22 మంది మృతి చెందారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో 12 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకో 10 మృతదేహాలను బయటికి తీయాల్సి ఉంది. వాటికోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఎన్జీఆర్ఎప్ బృందాలతో పాటుగా స్థానిక పోలీసులతో పాటుగా నేవీ సిబ్బందికి కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు.
మునిగిపోయిన లాంచి నీటిలోపల 45 అడుగుల లోతులో ఇసుకలో కూరుకునిపోయినట్టు సహాయక బృందాలు గుర్తించాయి. లాంచీ అద్దాలను బద్దలు కొట్టి అందులోని మృతదేహాలను బయటికి తీసేందుకు ప్రయత్నించగా అద్దాలు బద్దలు కొట్టడం సాధ్యం కాలేదు. దీనితో అతి కష్టం మీద మునిగిపోయిన లాంచీ ఒడ్డుకు లాక్కొని వచ్చారు. దీనితో ఇద్దరు చిన్నపిల్లలలతో సహా 12 మృతదేహాలు బయట పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పడవ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని సహాయకచర్యలను పర్యవేక్షించారు. మానవ తప్పిదనం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సీఎం వెల్లడించారు. ఇందుకు కారకులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు. వారిని అన్నిరకాలుగా ఆదుకుంటామన్నారు. పడవ ప్రమాదంలో ఆప్తులను పోగొట్టుకున్న వారి బాధను మాటల్లో వర్ణించలేమన్న ముఖ్యమంత్రి వారిని చూస్తే జాలేస్తోందన్నారు. ప్రమాదం జరిగిన తరువాత ఎన్జీఆర్ఎప్ బృందాలు సహాలంలో చేరుకున్నప్పటికీ చీకటి పడడంతో పాటుగా వాతావరణం అనుకూలించకపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలిగిందన్నారు. నేవీ అధికారులతో మాట్లాడి సహాయకకార్యక్రమాలకు నేవీ సిబ్బందిని పిలిపించినట్టు చంద్రబాబు వివరించారు.
మరోవైపు విపక్ష నేత జగన్ పడవ ప్రమాదం ఘటనను ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణించారు. పడవ ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అనుమతులు లేని పడవలు యాదేచ్చగా తిరుగుతున్నాయని అన్నారు. అక్రమంగా తిరుగుతున్న బోట్లకు మంత్రులు వత్తాసు పలుకుతున్నారని ఈ కారణంగానే అధికారులు వాటిని గురించి చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. గతంలో జరిగిన బోటు ప్రమాదలపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇందులో మంత్రులు, ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్ హస్తం ఉండడమే కారణమన్నారు.
boat accident,boat accident in godavari, godavari river, ngri, boat accident near devipatnam, devi pattanam, devi pattanam area, agency,godavari agency, tribal people, tribes.

52వేల ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసిన టిటిడి


కర్ణాటక పీఠం ఎవరికి దక్కుతుంది..?
/Godavari_River

Wanna Share it with loved ones?