తెలుగు టీచర్ డాక్టర్ బి.ఎల్.ప్రసూన పదవీవిరమణ

0
76

“తెలుగు టీచర్” గా సుపరిచితురాలు డాక్టర్ బి.ఎల్.లక్ష్మీ ప్రసూన పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం ఆమె తనికెళ్ల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.ఈ సందర్భంగా జరగిన కార్యక్రమంలో పలువుర డాక్టర్ ప్రసూన సేవలను కొనియాడారు. కేవలం విద్యార్థులకు పాఠాలు చెప్పడం తోనే తన బాధ్యత తీరిపోయిందని ప్రసూన భావించేవారు కాదని అటు విద్యార్థులకు, ఇటు తోటి ఉపాధ్యాయులకు తలలో నాలికలాగా వ్యవహరించే ప్రసూన పదవీ విరమణతో ఆ ఖాళీని భర్తీ చేయడం ఏవరి వల్లా సాధ్యం కాదన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ఏం.ఎ తెలుగు చేసిన లక్ష్మీ ప్రసూన అటు తర్వాత పద్మావతీ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిల్, పీహెచ్ డీ పట్టాలను అందుకున్నారు. చెన్నారంలో ఉపాధ్యాయురాలిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె ఖమ్మం జిల్లాలోని అనేక పాఠాశాలల్లో పనిచేసి తన దైన ముద్రను వేశారు. పదవీ విరమణ చేస్తున్న లక్ష్మీ ప్రసూనను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here