టీడీపీ బీజేపీల మధ్య పెరుగుతున్న దూరం

0
56

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మిత్ర పక్షాలు రెండు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఏపీ తామేమీ టీడీపీ దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి లేమని బీజేపీ అంటుంటే దమ్ముంటే తెలతెంపులు చేసుకోవాలని టీడీపీ సవాల్ చేస్తోంది. అటు బీజేపీ, ఇటు టీడీపీ కి చెందిన నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుని పడుతున్నారు. వీటిని నిలురించాల్సిన పార్టీ పెద్ద మాత్రం మౌనంగా ఉండిపోయారు. గుజరాత్ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దుమారానికి తెరతీశాయి. గుజరాత్ తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లపై తమ పార్టీ దృష్టి పెడుతుందని ఒంటరిగా ఆధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాక్యలతో వివాదం రాజుకుంది. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. బీజేపీ నేతలు స్థాయి తెలుసుని మాట్లాడాలంటూ చేసి వ్యాఖ్యాలు దుమారాన్ని మరింత పెంచాయి.
టీడీపీపై దాడిని తీవ్రతరం చేసిన బీజేపి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని వాజ్ పేయి మంచం పట్టడానికి చంద్రబాబే కరణమంటూ తీవ్ర విమర్శలు చేశారు. 2004లో చంద్రబాబు నాయుడి మాటలు విని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిందని దానివల్లే తమ పార్టీ ఓడిపోయిందని బీజేపీ నేత సోము వీర్రాజు అంటున్నారు. చంద్రబాబు చేసిన పని వల్లే తమ నేత అటల్ బిహారీ వాజ్ పేయి మంచంపట్టారంటూ తీవ్రంగా ఆరోపించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లకుండా ఉండి ఉంటే తమ పరిస్థితి మరో విధంగా ఉండేదంటూ ఆయన చెప్తున్నారు. చంద్రబాబు మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత తమ పుట్టి ముంచిందని ఆయన చెప్తున్నారు.
బీజేపీ అధిష్టానం అనుమతి తోనే స్థానిక నేతలు టీడీపీని టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగుతున్నరని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. పోలరవం తో పాటుగా ప్యాకేజీల వ్యవహారంతో టీడీపీ బీజేపిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్న నేతలు టీడీపీకి షాక్ ఇచ్చేందుకు తమ మాటల దాడిని పెంచినట్టుగా కనిపిస్తోంది.
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here