బీజేపీ అధిష్టానంతో నెయ్యం-రాష్ట్ర నేతలతో కయ్యం

బీజేపీ అధిష్టానంతో తెలుగుదేశం పార్టీ సఖ్యతను కొనసాగించాలని నిర్ణయించుకున్నా రాష్ట్రా స్థాయిలో మాత్రం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రానికి చెందిన బీజేపీ,టీడీపీ నేతలు పరస్కరం దూషించుకుంటున్నారు. విమర్శలు హద్దులు దాటిపోయాయి. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో దూషించుకుంటున్నారు. టీడీపీ నేతలు అవినీతిలో మునిగి తేలుతున్నారంటూ బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపించారు. ఇప్పటివరకు పార్టీ పైన విమర్శలు చేసిన బీజేపీ ఇంకాస్త ముందుకు వెల్లి పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై బీజేపీ నేతలు పరోక్షంగా తీవ్ర విమర్శలు చేయడం దుమారాన్ని రేపింది. దీనితో టీడీపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగారు.
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు విరుకుని పడుతున్నారు. వీర్రాజుతో పాటుగా బీజేపీ రాష్ట్రా స్థాయి నేతలపై కూడా మాటల యుద్ధానికి దిగారు. సొత్తు కోసం తాము వెంపర్లాడడం లేదని బీజేపీ నేతలు వాస్తవ పరిస్థితులను తెలుసుకుని మాట్లాడాలంటూ విరుచుకుని పడ్డారు. బీజేపీ రాష్ట్రా స్థాయిలో నేతలు తమని తాము చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే స్థాయి రాష్ట్ర బీజేపీ నేతలకు లేదని అంటున్న టీడీపీ నేతలు కొంత మంది బీజేపీ నాయకులు వైసీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు.Releated

సుష్మస్వరాజ్ కన్నుమూత

సుష్మాస్వరాజ్ కన్నుమూత…

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశాలు. తీవ్ర గుండెపోటుతో ఆమె చనిపోయారు. 67 సంవత్సరాల సుష్మ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనివల్లే ఆమె పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. సుష్మాకు మంగళవారం రాత్రి గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు దిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు మార్చారు. చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సురి […]

సుదర్శన యాగం

యాదాద్రిలో భారీ ఎత్తున సుదర్శన యాగం

యాదగిరి గుట్ట దేవాలయ పుననిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చేదిద్దేపనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ యాగ నిర్వహణకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామితో ముఖ్యమంత్రి చర్చించారు. యాదాద్రిలో వంద ఎకరాల యజ్ఞవాటికలో 1048 యజ్ఞ కుండాలతో యాగం నిర్వహించాలని నిర్ణయించారు. మూడు వేల మంది రుత్వికులు, మరో 3వేల […]