కేంద్ర ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం కల : కేటీఆర్

0
58

తెలంగాణలో ఎటువంటి బలం లేకపోయినా బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్వయంగా ప్రధాన మంత్రితో పాటుగా 11 మంది కేంద్ర మంత్రులు, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు విస్తృతంగా ప్రచారం చేసినా అసెంబ్లీ అన్నికల్లో కనీసం ఒక్కసీటు ను సాధించుకోలేకపోయిందని అట్లాంటిది ఇప్పుడు తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుతామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. కేంద్ర ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం కల్లాఅని ఆయన పేర్కొన్నారు. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కన్పించడం లేదన్నారు. తెలంగాణలో 16 సీట్లను గెల్చుకోవడం ద్వారా కేంద్రంలో టీఆర్ఎస్ ప్రధాన భూమిక పోషిస్తుందని చెప్పారు.Wanna Share it with loved ones?