ఫలించని బీజేపీ ఆపరేషన్ కమల

బీజేపీ ఆపరేషన్ కమల ఫలితాలను ఇవ్వలేదు. దీనితో యడ్యూరప్ప రాజీనామాలు చేయాల్సి వచ్చింది. అంతుకు ముందు జరిగిన పరిణామాలు ఓ సారి చూస్తే
• కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప శనివారం సాయంత్రం 4.00 కల్లా మెజార్టీ నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
• ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని కాంగ్రెస్, జేడీఎస్ ల కూటమి ముందుకు వచ్చినా కర్ణాటక గవర్నర్ బీజేపీకి అవకాశం ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్
సూప్రీంకోర్టును ఆశ్రయించింది.
• యడ్యూరప్పకు మెజార్టీ నిరూపించుకునేందుకు గవర్నర్ 15 రోజులు ఇచ్చిన గడువును కోర్టు తోసిపుచ్చింది.
• శనివారం సాయంత్రానికల్లా మెజార్టీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది.
• మరికొంత గడువుకావాలంటూ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
• విశ్వాస పరీక్షలో నెగ్గుతామని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
• కాంగ్రెస్, జేడీఎస్ లు మాత్రం ప్రభుత్వం పడిపోవడం ఖాయమంటున్నాయి.
• సుప్రీంకోర్టు ఆదేశాలు అందిన వెంటనే కర్ణాటక గవర్నర్ ప్రోటెం స్పీకర్ ను ఎంపికచేశారు.
• ప్రోటెం స్పీకర్ గా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేను ఎంపికచేయడంపై కాంగ్రెస్ జేడీఎస్ లు భగ్గుమంటున్నాయి.
• సీనియార్టీని పక్కనపెట్టి గవర్నర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని మండిపడుతున్నాయి.
• హైదరాబాద్ తో పాటుగా వివిధ ప్రాంతాల్లో క్యాంపుల్లో ఉన్న తమ ఎమ్మెల్యేలను ఓటింగ్ సమయానికల్లా బెంగళూరు తరలించేందుకు కాంగ్రెస్ , జేడీఎస్ లు
ఏర్పాటు చేస్తున్నాయి.
• ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ , జేడీఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
• మరో వైపు బీజేపీ విపక్ష ఎమ్మల్యేలను ఆకర్షించే పనిలో బీజీగా ఉంది.
• ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు గాలిజనార్థన్ రెడ్డితో సహా పలువురు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు.
• విపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ కులకార్డుతో పాటుగా అన్ని రకాల ప్రలోభాలకు గురిచేస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి.
• కర్ణాటక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారడంతో దేశం యావత్తు ఇప్పుడు కర్ణాటకపైనే దృష్టి పెట్టింది.
• కోర్టు నిర్ణయంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా మరింత వేడెక్కాయి.
• బీజేపీ పెద్ద ఎత్తున బేరసారాలకు పాల్పడుతోందని కాంగ్రెస్, జేడీఎస్ లు ఆరోపిస్తున్నాయి.
• గాలిజనార్థన్ రెడ్డి తమ ఎమ్మెల్యేతో మాట్లాడినట్టుగా చెప్తున్న ఆడియో టేపును కాంగ్రెస్ విడుదల చేసింది.