కర్ణాటకలో కమలవికాసం… అధికారానికి కాస్తదూరంలో బీజేపీ

0
56

కర్ణాటకలో బీజేపీ సత్తా సాటింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజార్టీకి కాస్త దూరంలో నిల్చిపోయింది. ప్రస్తుత సమాచారం ప్రకారం బీజేపీ 106 సీట్ల మాత్రమే సొంతం చేసుకుంది. కనీస మెజార్టీకి 113 సీట్లు కావాలి. అంటే బీజేపీకి మెజార్టీ కంటే 7గురు అభ్యర్థులు తక్కువగా ఉన్నారు. దీనితో ఇప్పుడు మూడో అతిపెద్ద పార్టీ జేడీఎస్ కింగ్ మేకర్ గా మారబోతోంది. తుది ఫలితాలు వచ్చే వరకు అన్ని పార్టీలో వేచిచూసే ధోరణలో ఉన్నప్పటికీ ఇప్పటికే కర్ణాటలో బేరసారాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
తిరిగి కర్ణాటకలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు గల్లంతయ్యాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి దశగా కాంగ్రెస్ పార్టీ ఆదిక్యంలో ఉన్నా ఆ తరువాత క్రమంగా బీజేపీ పుంజుకుంది. కర్ణాటకలో బీజేపీ పాగా వేసింది.
కర్ణాటలో సాధారణంగా ప్రతీ ఎన్నికల్లోనూ కనిపించే అధికార వ్యతిరేకత మరోసారి తన ప్రతాపాన్ని చూపింది. మోడీ కి వ్యతిరేక పవనాలు దేశవ్యాప్తంగా వీస్తున్నాయని వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. కర్ణాటలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని తేలిపోవడంతో బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

Wanna Share it with loved ones?