సర్జికల్ దాడులు చేస్తే కానీ వాళ్లకు బుద్ది రాదు: బిపిన్ రావత్

0
69
బిపిన్ రావత్

బిపిన్ రావత్: భారత-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. భారతీయ సరిహద్దు భద్రతా దళానికి చెందిన కానిస్టేబుల్ ను దారుణంగా హతమార్చిన పాకిస్థాన్ చర్యని సైన్యం తీవ్రంగా పరిగణిస్తోంది. అటు కాశ్మీర్ లో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసులను వారి ఇళ్ల నుండి అపహరించిమరీ హత్యలకు పాల్పడ్డారు. ఈ చర్యలతో అటు సరిహద్దులతో పాటుగా ఇటు కాశ్మీర్ లోయలోనూ పరిస్థితులు ఉధ్రిక్తంగా మారాయి.
ఒక పక్క పాకిస్థాన్ భారత్ రెచ్చగొట్టే చర్యలకు దిగుతూనే మరో వైపు చర్చలకు సిద్ధం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న దాయాది దేశానికి భారత ప్రభుత్వం గట్టి హెచ్చరికలే చేసింది. చర్చలు జరుపుదామంటూ ప్రతిపాదించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఆహ్వానాన్ని తిరస్కరించడంతో పాటుగా న్యూయార్క్ లో ఇరు దేశాల మధ్య జరగాల్సిన చర్చలను సైతం భారత్ నిలిపేసింది.
భారత సైన్యాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సివస్తుందని మన సైన్యం గట్టి హెచ్చరికలు చేసింది. పోలీసులను హతమార్చాల్సిందిగా ఉగ్రవాదులకు ఐఎస్ఐ నుండే ఆదేశాలు అందాయని విషయాన్ని భారత నిఘా వర్గాలు కనిపెట్టాయి. పాకిస్థాన్ సైన్యం ప్రేరేపించడంతోనే ఉగ్రవాదులు ఇటువంటి ఘాతుకాలకు పాల్పడుతున్నరని సైన్యం గుర్తించింది. పాక్ తగిన బుద్దిచెప్పేందుకు ఆర్మీ సిద్ధం అవుతోంది. మరో సారి సర్జికల్ తరహా దాడులు జరపాల్సిన అవసరం ఉందని సైన్యాధిపతి జనరల్‌ బిపిన్ రావత్‌ అన్నారు. పాకిస్థాన్ తన దుర్మార్గాలను ఆపకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రావత్ స్పష్టం చేశారు.
General Bipin Rawat,Bipin Rawat,Indian Army,Line of Actual Control,Chief of the Army Staff,surgical strike,Army chief Bipin Rawat,terrorists.
నిర్ణయాత్మక శక్తిగా బ్రాహ్మణ ఓటర్లు:తులసీ శ్రీనివాస్
Bipin_Rawat

Wanna Share it with loved ones?