ఉత్తమ ప్రధాని మోడీనే-రెండో స్థానంలో ఇందిరాగాంధీ

0
58
best Prime Minister of India

best Prime Minister of India ఇప్పటి వరకు 15 మంది భారత ప్రధానులుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడి 16వ వ్యక్తి. మన ప్రధాన మంత్రులందరిలో ఎవరు ఉత్తమ ప్రధానిగా ప్రజలు భావిస్తున్నారు అనే అంశంపై జరిగిన సర్వేలో ఆశక్తికర ఫలితాలు వచ్చాయి. గతంలో ప్రధానులుగా పనిచేసిన వారందరినీ పక్కనపెట్టి ఉత్తమ ప్రధానిగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీవైపే ప్రజలు మొగ్గుచూపారు. మోడీనే ఉత్తమ ప్రధానిగా దేశప్రజలు భావిస్తున్నట్టు “ఇండియా టుడే” నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. ఉత్తమ ప్రధాన మంత్రి గా నరేంద్ర మోడీ వైపు 26 శాతం మంది ప్రజలు మొగ్గు చూపగా ఇందిరా గాంధీ ఆరు శాతం ఓట్ల తేడాతో రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇటీవల కన్నుమూసిన అటల్ బిహారీ వాజ్ పేయి అత్యన్నత ప్రధానిగా 12శాతం మంది భావించగా తొలి ప్రధాని జనహర్ లాల్ నెహ్రుకు 10 శాతం ఓట్లు వచ్చాయి.
రాజీవ్ గాంధీ ఉత్తమ ప్రధానిగా 7 శాతం మంది భావించగా, మన్మోహన్ సింగ్ కు 6 శాతం మద్దతు పలికారు. హెడీ దేవగౌడ, పీ.వీ.నరసింహారావు, చంద్రశేఖర్ , వీ.పీ. సింగ్ లు ఉత్తమ ప్రధాన మంత్రులుగా కేవలం ఒక్కశాతం మాత్రమే భావిస్తున్నారు. రెండు సార్లు ప్రధాన మంత్రిగా కొద్ది కాలం పనిచేసిన గుల్జారీలాల్ నందాతో పాటుగా లాల్ బహదూర్ శాస్త్రీల పేర్లను పెద్దగా ఎవరూ చెప్పలేదు.
ప్రధాని నరేంద్ర మోడీ వైపు హింధువులు మక్కువ చూపగా ముస్లీంలు మాత్రం ఇందిరాగాంధీనే అత్యున్నత ప్రధానమంత్రిగా పేర్కొన్నారు. హింధువుల్లో 28 శాతం మంది మోడీ వైపు మొగ్గుచూపగా ముస్లీంలలో ఆ సంఖ్య 11 శాతం మాత్రమే. 26 శాతం మంది ముస్లీంలు ఉత్తమ ప్రధానిగా ఇందిరాగాంధీ పేరు చెప్పారు. తూర్పు, ఉత్తర భారతదేశంలో మోడీకి పెద్ద సంఖ్యలో ప్రజాదరణ లభించింది. పశ్చిమ భారతంలో ఇందిరాగాంధీకీ మోడీకి సమానంగా ఓట్లు పడగా దక్షిణ భారత దేశంలో మాత్రం మోడి వెనకబడిపోయారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఇందిరాగాంధీనే ఉత్తమ ప్రధానిగా భావిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దక్షిణ భారత దేశంలో 26శాతం ఇందిరాగాంధీకే ఓటేశారు.

మోడీ తరువాత రాహులే
2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ తరువాత ప్రధాని అభ్యర్థిగా ఎవరిని భావిస్తున్నారంటూ జరపిన సర్వేలో రాహుల్ గాంధీకి 46 శాతం మంది ప్రజలు ఓటేశారు. మోడీకి ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీనేనని వారు అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైపు 8 శాతం మంది మొగ్గుచూపారు.
మెజార్టీ కన్నా బీజేపీకి తక్కువ సీట్లు

గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఈ దఫా ఇబ్బందులు తప్పేట్టు లేవని సర్వేలో తేలింది. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశం ఉన్నప్పటికీ మెజార్టీకి అవసరం అయిన సీట్లకు మాత్రం కొంతదూరంలోనే నిల్చిపోయే అవకాశం ఉందని సర్వేలో తేలింది. 543 మంది సభ్యులున్న లోక్ సభలో ఒక్క బీజేపీ బలం 271గా ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం అధికారంలోకి అవసరమైన 272 సీట్లకు కొద్దిదూరంలోని ఎన్డీఏ నిలుస్తుందని సర్వేలే తేలినప్పటికీ కాంగ్రెస్ దాని మీత్రపక్షాలు అధికారంలోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. అన్ని పక్షాలు కలుపుకుని 122 సీట్లకు పరిమితం అవుతాయని సర్వే ఫలితాలు తేల్చేశాయి. మెజార్టీ తగ్గినప్పటికీ తిరిగి ఎన్డీఏ కూటమి ఇతర పార్టీల మద్దతుతో అధికారంలోకి రావడం ఖాయమని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
దేశం నాలుగు చెరుగులా అన్ని వర్గాలకు చెందిన 12100 మందితో సర్వేను నిర్వహించినట్టు “ఇండియా టుడే” వెల్లడించింది.
Who is the best Prime Minister of India, Atal Bihari Vajpayee, Indira Gandhi, Prime Minister Narendra Modi, Nation survey, India Today.

వాళ్లకే టికెట్లిస్తే మా పరిస్తితి ఏంటి -టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి


కేరళ వరదలకు కారణం- దేవుడి శాపమా..? మనిషి పాపమా…?

Wanna Share it with loved ones?