తెలంగాణలో పెరగనున్న బీర్ల ధరలు

0
73
బీర్ల ధరలు
beer rates

తెలంగాణలో బీర్ల ధరలు పెరగనున్నాయి. మండు వేసవిలో చల్లని బీర్ తాగుదామనుకుంటున్నవారికి ఇది నిజంగానే చేదు వార్త. బీర్ల అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలోనే బీర్ల ధరలు 10 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయి. బీర్ల కనీస ధరను పెంచాలంటూ చాలా కాలంగా తయారీదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అన్ని రకాల ధరలు పెరిగిన నేపధ్యంలో బీర్ల కనీస ధరను పెంచాలంటూ వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వారి డిమాండ్ మేరకు ప్రభుత్వం బీర్ల ధరలపై నిర్ణయం తీసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
బీర్ల ధరలపై ‘రేట్ కాంట్రాక్ట్ అండ్ నెగోషియేషన్స్ కమిటీ’ ఒక నిర్ణయానికి వచ్చింది స్టాంగ్ బీర్లపై 10 శాతం, లైట్ బీర్లపై 9 శాతం రేట్లను పెంచేందుకు కమిటీ అంగీకరించింది. బీర్ల తయారీ సంస్థలు మాత్రం 12 నుండి 15 వరకు ధరలను పెంచాల్సిందిగా కోరారు. రిటైర్ట్ జడ్జి, రిటైర్డ్ ఐఏఎస్, చార్టెర్డ్ అకౌంటెంట్ తో కూడిన ఈ త్రిసభ్య కమిటీ 9శాతం, 10 శాతం ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది.
కమిటీ సిఫార్సులను ప్రస్తుతం ఎక్సైజ్ కమిషనరేట్ వద్ద ఉన్నాయి. అక్కడి నుండి తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కు చెందిన బోర్డు డైరెక్టర్ల ఆమోదం తెలిపిన తరువాత ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంటుంది. అక్కడ ఆమోద ముద్ర లభించిన తరువాత బీర్ల ధరలు పెరుగుతాయి.
అయితే ఇవన్నీ లాంఛనమే. ‘రేట్ కాంట్రాక్ట్ అండ్ నెగోషియేషన్స్ కమిటీ’ తీసుకున్న నిర్ణయాన్నే ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనితో బీర్ల ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీరు ప్రియులకు ఇది చేదు వార్తే. ఇప్పటికే తెలంగామలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అన్ని రికార్డులను తోసిపుచ్చి మధ్యం ప్రియులు బీర్ల సీసాలను తెగ ఖాలీ చేసేస్తున్నారు.
తమ ఆదాయం గణనీయంగా పడిపోయిందని చాలా కాలంగా మధ్యం తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముడిసరుకుతో పాటుగా ఇతరత్రా ఖర్చులు పెరిగిపోయినందున బీర్ల బేసిక్ ప్రైస్ ను పెంచాలనేది వారి డిమాండ్. దీనిపై ప్రభుత్వం స్పందించిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా ధరలను పెంచేందుకే సుముఖత వ్యక్తం చేయడంతో ఇక ధరల పెరగడం లాంఛనమే.
ఇటీవల కాలంగా మండుతున్న ఎండలకు తోడు ఐపీఎల్ సీజన్, పెళ్లిళ్ళు ఎక్కువగా ఉండడం కూడా బీర్ల అమ్మకాలు భారీగా పెరగడానికి కారణంగా చెప్తున్నారు. దేశం మొత్తం మీద కేరళలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు కేరలను తోసి రాజని తెలంగాణ మొదటి స్థానంలోకి దూసుకుని వచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే బీర్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ధరల పెరుగుదల తరువాత అయినా బీర్ల ప్రియుల జోరు తగ్గుతుందా.లేదో వేచిచూడాల్సిందే.
beer, beer sales in telangana, beers, beer rates, beer rates in telangana, excise department, telangana excise department, telangana beverage corporation,beverage company, beverages companies.

ఉత్తరాదిన దుమ్ము తుపాను 100 మంది మృతి


akhilesh-yadav
Beer
Alcoholic_drink
Alcohol

Wanna Share it with loved ones?