బెంగళూరులో మరో వేధింపు ఘటన

     గార్డెన్ సిటీ బెంగళూరు ఇప్పుడు యువతులను వేధించే వారికి కేరాఫ్ అడ్రస్ గా మారిందా. మహిళలను వేధించడమే ప్రధాన లక్ష్యంగా తిరుగుతున్న గ్యాంగులకు కొదవలేకుండా పోతోంది. డిసెంబర్ 31వ తేదీన బెంగళూరులో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుండగా తాజాగా మరో యువతిని వెంబడించి వేధించాడో కీచకుడు. బెంగళూరు కేజీ హాలి ప్రాంతంలో మరోసారి యువతిని వేధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించి వేధించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను విసురుగా రోడ్డు మీదకు నెట్టివేయడంతో యువతికి గాయాలయ్యాయి. ఆమె పెద్దగా అరవడంతో స్థానికులు దుండగుడి బారినుండి ఆమెను రక్షించారు. ఈ పెనుగులాటతో యువతికి గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ దృశ్యాలు అన్నీ సీసీ కెమేరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *