బండారు దత్తాత్రేయ కు పుత్రశోకం

0
64
బండారు దత్తాత్రేయ కుమారుడు బండారు వైష్ణవ్ గుండె పోటుతో మరణించారు.
Bandaru Dattatreya son bandaru vishanv died with heart attack

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు బండారు వైష్ణవ్ అంత్యక్రియలు సైదాబాద్ శ్మశానవాటికలో జరగనున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలు, బీజేపీ కార్యకర్తలు, బంధువులు, వైష్ణవ్ స్నేహితులు బండారు నివాసానికి చేరుకుంటున్నారు. కొడుకు మృతదేహాన్ని చూసి బండారు దత్తాత్రేయ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన్ను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. గుండెపోటుతో బండారు దత్తాత్రేయక కుమారుడు బండారు వైష్ణవ్ (21) మంగళవారం రాత్రి మృతిచెందారు.
ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వైష్ణవ్ అఖస్మాత్తుగా మరణించడంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న వైష్ణవ్ భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆయన రాత్రి తుదిశ్వాస విడిచారు. అతిచిన్న వయసులో గుండెపోటుతో కన్నబిడ్డను కోల్పోయిన బండారు దత్తాత్రేయను ఓదార్చేందుకు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నాయకులు వస్తున్నారు.
బండారు దత్తాత్రేయకు ఇద్దరు పిల్లలు. ఒక కుమారై, ఒక కుమారుడు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తో పాటుగా పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ మేజరు రాంమ్మోహన్, తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు కోదండరాంతో సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు బండారు దత్తాత్రేయ నివాసానికి చేరుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు బండారు దత్తాత్రేయను ఫోనులో పరామర్శించారు.
Former union minister,Member of Parliament Bandaru Dattatreya, Bandaru Vaishnav, Ramnagar , Vaishnav was declared dead. The mayor of Hyderabad, Bonthu Ramamohan, State BJP president Dr K Laxman.

తూత్తకూడి లో హింస -పోలీసు కాల్పుల్లో 9 మంది మృతి


నిపా వైరస్ పై ఆందోళన వద్దంటున్న ప్రభుత్వం
Bandaru_Dattatreya

Wanna Share it with loved ones?