ఆస్పత్రి నుండి ఇంటికొచ్చిన బాలకృష్ణ

0
73

కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న బాలకృష్ణ ఆస్పత్రి నుండి డిశ్చార్జీ అయ్యారు. కొంత కాలంగా గాయం కారణంగా బుజం నొప్పితో బాధపడుతున్న బాలకృష్ణకు నగరంలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ డాక్టర్లు డాక్టర్ దీప్తీ నందన్ రెడ్డి, డాక్టర్ ఆశిష బాబుల్కర్ లు బాలయ్య బాబుకు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆపరేషన్ పూర్తిగా విజయవంతం కావడంతో ఆయన్ని ఆస్పత్రి నుండి డిశ్చార్జీ చేశారు.
ప్రస్తుతం బాలకృష్ణ కు నిర్వహించిన ఆపరేషన్ పూర్తిగా విజయవంతం అయిందని, ఆరు వారాల విశ్రాంతి తరువాత ఒకసారి ఆస్పత్రికి రావాల్సి ఉంటుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విశ్రాంతి తరువాత బాలకృష్ణ పూర్తిగా మామూలుగానే పనిచేసుకోవచ్చని చెప్పాయి. బాలకృష్ణ ఆస్పత్రి నుండి డిశ్చార్జీ అవుతున్న సందర్భంలో ఆస్పత్రిలోని డాక్టర్లు ఆయనతో ఫొటోలు తీయించుకున్నారు.



Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here