డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష-విలపించిన గుర్మీత్

0
65

డేరా సచ్చా సౌధా అధినేత బాబా గుర్మీత్ రామ్ రహీమ్ కు అత్యాచారం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 10 సంవత్సరాల జైలుశిక్షను విధించింది.ఆయనపై ఉన్న రెండు కేసుల్లోనూ శిక్ష పడింది. ఒక్కో కేసులో 10 సంవత్సరాల శిక్షను ఖరారు చేశారు. మొత్తం 20 సంవత్సరాల జైలు శిక్షను డేరా బాబా అనుభవించాల్సి ఉంది. రెండు వేర్వేరు కేసులైనందు వల్ల ఏకకాలంలో శిక్షను అనువించడానికి వీలు లేదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. తన శిష్యురాళ్లు ఇద్దరిపై అత్యాచారం జరిపిన గుర్మీత్ పై 2002లో కేసునమోదయింది. గుర్మీత్ ను ఈ కేసులో దోషిగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు చెప్పిన తరువాత హర్యారా, పంజాబ్ లలో చెలరేగిన హింసాకాండను దృష్టిలో పెట్టుకుని రోహ్ తక్ జైలులోని ఓ గదిలోని విచారణ జరిపిన సీబీఐ న్యాయమూర్తి తన తీర్పును వెలువరించారు. గుర్మీత్ ఈ కేసులో దోషి అంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు చెప్పిన తీర్పుతో చెలరేగిన సింహాకాండలో 38 మంది ప్రాణాలు కోల్పోగా వందల మందికి గాయాలయ్యాయి. అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను గుర్మీత్ అనుచరులు ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. గుర్మీత్ కేసులో కోర్టు శిక్షను విధించిన నేపధ్యంలో హర్యానా, పంజాబ్ లతో పాటుగా ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీలలోనూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రాతా ఏర్పాట్లు చేశారు.
శిక్ష విధించకముందు కోర్టులో గుర్మీత్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆయన సామాజిక కార్యకర్తగా పేర్కొన్నారు. అనేక ధార్మిక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా సమాజహితం కోసం పాటుపడుతున్నారని అనేక ఉచిత వైద్య,విద్యా సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. సీబీఐ తరపున న్యాయవాది మాత్రం గుర్మీత్ ను కఠినంగా శిక్షించాలని వాదించారు.
సీబీఐ ప్రత్యేక కోర్టులో గుర్మీత్ తనపై జరుగుతున్న విచారణ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తనను క్షమించాలంటూ బోరున విలపించినట్టు సమాచారం.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here