రాసలీలల స్వామీజీలను చెప్పుతో కొట్టాలి

బాబాలు, స్వామీజిల పేరుతో కొంత మంది చేస్తున్న వెధవపనుల వల్ల ప్రజలకు స్వామీలపైనే నమ్మకం పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఆధ్యాత్మిక ముసుగులో ఈ వెధవలు చేసే అడ్డమైన పనులతో సమాజంలో వారి పట్ల ఉన్న గౌరవ భావం తగ్గుతోంది. ఒక సినీ నటితో సన్నిహితంగా ఉంటూ కేమేరాలకు చిక్కిన కర్ణాటకు చెందిన ఓ స్వామీజీ చేష్టలు ఏవగింపు కలిగిస్తున్నాయి. ఒకరు కాదు ఇద్దురు కాదు దేశంలోని చాలా మంది బాబాల చీకటి భాగోతాలు వెలుగులోకి రానంత వరకు గొప్పవారుగానే చలామణి అవుతున్నారు.
అన్ని మతాల్లోనూ ఇటువంటి వెకిలిగాళ్లు, కామాందులకు కొదవేలేదు. ఆధ్యాత్మికత పేరుతో అన్నిరకాలు అనైతిక కార్యక్రమాలకు దిగుతున్న పెద్ద మనుషులు తమ భాగోతాలు బయటికి వచ్చినప్పటికీ బుకాయించడంతో పాటుగా వారిని అంతకన్నా గుడ్డీగా భక్తులు ఇంకా నమ్ముతుండడం విచిత్రం. కెమేరా కళ్లకు అడ్డంగా చిక్కినా ఇంకా తమ బాబా గొప్పవాడేననే వారి నమ్మకాన్ని భక్తి అనలా లేక మూఢత్వం అనాలా అనే సంగతి తెలియడం లేదు. దేవుడి పేరుతో వీరు సాగినస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. నమ్మి వచ్చిన మహిళా భక్తులను వంచించడం, వెకిలి చేష్టలు చేయడం దగ్గర నుండి భూ దందాలు, ఆక్రమణలు మొదలు సకల అసాంఘీక కార్యక్రమాలకు కొన్ని సంస్థలు నిలయంగా మారుతున్నాయి. ప్రజల్లో పెరిన భయాన్ని క్యాష్ చేసుకుంటున్న ఈ బాబాలు ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదుగుతున్నారు. ఒక సారి డబ్బు రుచి మరిగిన తరువాత అడ్డమైన దార్లు తొక్కుతున్న నీచులు తాము చేస్తున్న దారుణాలను కప్పిపుచ్చుకునే క్రమంలో డేవుడి పేరును వాడుకుంటున్నారు.
ఏ మతానికి చెందిన వారైన దేవుడి పేరుతో అనైతిక కార్యక్రమాలుకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వారికి ప్రజలే చెప్పులతో సన్మానం చేస్తేనే మిగతా వారికి బుద్దొస్తుంది.

Releated

శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్ ఆరోగ్యహారం – పేద ప్రజలకు గొప్ప వరం

చిత్తూరు జిల్లాలో “ఆరోగ్యహారం” పేరుతో శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్, శ్రీ వరాహ నర్సింహ్మస్వామి అధ్యాత్మ సమాజసేవా ట్రస్ట్ లు సంయుక్తంగా సమగ్ర వైధ్య శిభిరాలను నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని మదనపల్లికి సమీపంలోని వి. కొత్తకోట కందుకూరు అగ్రహారం గ్రామంలో ప్రస్తుతం ఈ వైధ్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్టు ట్రస్టు ప్రతినిధిలు ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థల ఆధ్వర్యంలో పూర్తిగా సమగ్రంగా గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నామని శ్రీ వరాహ నర్సింహ్మస్వామి అధ్యాత్మ సేవా ట్రస్ట్ బాధ్యాలు […]

5న పోలింగ్‌.. 9న ఫలితాలు

బెంగళూరు: కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్‌ 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రేపటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. అయితే అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గడువు ముగిసే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 15 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు […]