హనీ సింగ్ పెంపుడు కూతురు కాదు…

0
47

ఇప్పటివరకు రామ్ రహీమ్ గుర్మీత్ పెంపుడు కూతురుగా చెప్పుకుంటున్న హనీప్రీత్ సింగ్ కు సంబంధించి ఆశ్చర్యపర్చే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అందరూ అనుకుంటున్నట్టుగా హనీ గుర్మీత్ పెంపుడు కూతురు కాదని వారి మధ్య మరేదో సంబంధం ఉందని హనీ మాజీ భర్త విశ్వాస్ గుప్తా అంటున్నాడు. హనీ ప్రీత్ కు గుర్మూత్ కు మధ్య వివాహేతర సంబంధం ఉందని చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని గుర్మీత్ మాజీ బాడీగార్డు కూడా వెల్లడించగా ఇప్పుడు గుప్తా వీరిద్దరి సంబంధం గురించి బయటి ప్రపంచానికి చెప్పాడు. గతంలో డేరా బాబా భక్తుడిగా ఉన్న గుప్తా తో పాటుగా అతని భార్య కూడా గుర్మీత్ వద్దకు వచ్చేది. ఈ క్రమంలోనే గుర్మీత్ కు హనీ సింగ్ కు మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. దీనితో భర్తకు విడాకులు ఇచ్చిన హనీ సింగ్ గుర్మీత్ తో పాటే ఆశ్రమంలో ఉండిపోయింది. డేరా బాబా గుర్మీత్ నటించిన అనేక చిత్రాల్లో ఆమె కూడా నటించింది. డేరా బాబాకు సంబంధించిన ఆశ్రమంలో బాబా తరువాత అన్ని ప్రదేశాల్లోనూ తిరిగగలిగింది ఒక్క హనీ సింగ్ మాత్రమే.
తాను తన భార్య గుర్మీత్ తో కలిసి అనేక ప్రాంతాల్లో పర్యటించామని విశ్వాస్ గుప్త చెప్పాడు. ఆ సమయంలోనే తన భార్యతో గుర్మీత్ వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడని వెల్లడించాడు. వారిద్దరూ అభ్యంతరకర స్థితిలో ఉండగా తాను చూసి ఇద్దరినీ నిలదీశానని దీంతో బాబా అనుచరులు తనను బెదిరించారని చెప్తున్నాడు. వారి బెదిరింపులకు భయపడి తాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు గుప్తు పేర్కొన్నాడు. ధనిక కుటుంబంలో పుట్టిన తాను అన్ని ఉండి కూడా డేరా బాబా వల్ల అనేక ఇబ్బందులకు గురైనట్టు విశ్వాస్ గుప్తా చెప్తున్నాడు. తనపై తమ మాజీ భార్య అనేక కేసులు పెట్టిందని బాబా అనుచరులు తనను బెదిరింపులకు గురిచేశారని అన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here