జమ్మిచెట్టు మింగిన బకాసురులు ఎవరు?

(వాట్సప్ లో వచ్చిన ఓ వ్యాసం యాధాతథంగా)
‘‘నీ తల్లి మహాపతివ్రత‘‘ అని పక్కవాడు ఒప్పుకొంటేకానీ తల్లిని గౌరవించని వాడి కన్నా భావదారిద్రులు మరొకరు లేరు. వినడానికి కటువుగా ఉన్నా మన వైద్యమండళ్ల పనితీరు ఇలాగే ఉంది. దీనికి ఉదాహరణగా కేరళకు చెందిన డాక్టర్ త్యాగరాజన్ విషయంలో జరిగింది తెలుసుకుంటే మీరు కూడా దీన్ని అంగీకరిస్తారు.
ఆయన 1979లో పిహెచ్ డిలో భాగంగా నేల ఉసిరి అనే ఆయుర్వేద మొక్క మీద పరిశోధన చేసి ఒక పరిశోధనా పత్రాన్ని భారతీయ వైద్యపరిశోధన ప్రచురణల పత్రికకు పంపితే దాన్ని ప్రచురించకుండా మన ఘనత వహించిన అమెరికా భక్త వైద్యమేధావులు తొక్కిపెట్టారు. పట్టువదలని త్యాగరాజు హెపటైటిస్ వైరస్ గుర్తించి నోబెల్ పొందిన డాక్టర్ బారుక్ బ్లూమ్బెర్గ్ కు తన పరిశోధనా పత్రం పంపితే ఆయన ఆయుర్వేదమందు ఔన్నత్యం అంగీకరించి ఆశ్చర్యపోయారు.
ఇది జరిగాక కానీ భారత వైద్యకుహనామేధావులు తమకు సంవత్సరాల క్రితం చేరిన త్యాగరాజన్ పరిశోధనా పత్రం ఎక్కడుందో వెతికలేదు. దాంతో సీటు తుడుచుకుని చెత్తకుండీలో పారేశామని గుర్తుకు వచ్చి కుండీని కెలికి తీసి దాన్ని ప్రచురించారు. బారుక్ కనుక అవును ఆయుర్వేదమందు అద్భుతం అనకపోతే త్యాగరాజు పరిశోధనా పత్రం నేటికీ చీకట్లోనే ఉండేదే. ఈ సంఘటన తరువాత ఈ సెక్కులర్ మేధావుల వైఖరి మీద అనుమానం వస్తోంది. పరాయివాడు పతివ్రత అనందే సొంత తల్లి కూడా వీరికి పతివ్రత కాదు. కట్టుకున్న భార్య మీద చెయ్యి కూడా వేయరు. చాలా అద్భుతమైన సెక్యులర్ పాతివ్రత్యం భారతదేశ వైద్యరంగంలో నడుస్తోంది.
ఈ నీచులకు ప్రజాశ్రేయస్సు విశ్వమానవకళ్యాణం అవసరం లేదు. అమెరికా వైద్యరాక్షసులకు కొమ్ముకాస్తు ఆహాఓహా అంటూ వారు భారతరోగులశవాలమీద పారేసిన పేలాలు ఏరుకు తినడమే నేడు నడుస్తున్న ఇండియన్ మెడికల్ ప్రొఫెషన్.
ఇది తెలియాలంటే ఈ క్రింది అంశం అర్థం చేసుకోండి.
ఈ రోజు ఆయుర్వేదానికి అద్భుతమైన అవకాశం వచ్చింది. ప్రపంచం ఆంగ్లవైద్యాన్ని చీదరించుకొంటోంది. అమెరికా ఫార్మాకంపెనీల దోపిడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కనుక నేడు అంతర్జాతీయ ప్రమాణాలతో ఆయుర్వేదాన్ని తిరిగి బ్రతికించుకుంటే ప్రపంచశ్రేయస్సును మన మహర్షుల భిక్షగా అందించవచ్చు. దీనికి ఉదాహరణే హెపటైటిస్ బి మందు. నేలఉసిరిని ఉపయోగించి కీజ్రనెల్లి అనే మందును తయారు చేయగలిగితే ప్రపంచంలోని 82 దేశాలలో డిమాండ్ సిద్ధంగా ఉంది. దీనికి చేయవలసింది నేల ఉసిరిని పండించి ఆయుర్వేద మందులు తయారు చేయడమే.
ఇది చేయడానికి డాక్టర్ త్యాగరాజన్ తన 40 ఏళ్ల సుదీర్ఘమైన జీవితాన్ని అమెరికా ఫార్మారంగాలతో పోరాడడానికే వెచ్చించాల్సి వచ్చింది. కానీ ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా మందులు అమ్మాలంటే అంతర్జాతీయ వైద్య మండళ్ళ నాణ్యతా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ మండళ్ళు అన్నీ అమెరికా రౌడీఫార్మాల కబ్జాల్లో ఉన్నాయి. కనుక ఆయుర్వేద మందులకు అంతర్జాతీయ అమ్మకానికి అర్హతలు ఇవ్వవు. పోనీ వాటిని భారత సంప్రదాయ ముద్రలతో అమ్ముదామా అంటే తమ రాజముద్రలు లేవు కనుక రౌడీ ఫార్మాలు ఆయుర్వేద మందులను చీకటి మందులుగా వర్గీకరించి నిషేధిస్తాయి. అంతేకాదు వీటిని ఉపయోగించే వైద్యుల మీద కేసులు పెట్టి జైళ్లలోకి నెడతాయి.
నేడు ఎంతో మంది వైద్యులు తమ కళ్ళముందు జరుగుతున్న దారుణాలు తెలిసినా అమెరికా ఫార్మామాఫియాను ఎదిరించి జైళ్ళలో కూర్చోవడం ఇష్టం లేక కళ్ళుమూసుకొని ఆంగ్లవైద్యం చేస్తున్నారు.
కనుక భారత ప్రభుత్వం అత్యవసరంగా భారత వైద్య ఔషథ నాణ్యతా ప్రమాణాల సంస్థను అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు మించే విధంగా ప్రారంభించి ఆయుర్వేద మందులకు అంతర్జాతీయ హోదా ఇవ్వాలి. ఇది చేయడం కన్నా అమెరికాతో ప్రత్యక్షయుద్ధం ఉత్తమం. ఎందుకంటే అమెరికాకు అత్యధిక ఆదాయం ఆయుధాల అమ్మకాల తరువాత వైద్యమాఫియా వల్లే వెళుతోంది.
నిజానికి నేడు లక్షల నుంచీ కోట్ల రూపాయల్లో ఒక్కో రోగి నుంచీ వసూలు చేస్తున్న ఒక్కో ఖరీదైన మందులను ఆయుర్వేదంతో అవలీలగా పెరటి మొక్కలతో తగ్గించవచ్చు. ఉదాహరణకు పచ్చకామెర్లు. దీనికి భారతదేశంలో అద్భుతమైన ఆయుర్వేద, జానపద, గిరిజన మందులు ఉన్నాయి. వీటిని వారు రహస్యంగా మాత్రమే చికిత్స చేస్తారు. ఆనువంశీకమైన వైద్యవిధానంలో తమ పసర్లు, మందులు వేటితో తయారు చేస్తున్నారో ఇతరులకు చెప్పరు. దీనికి కారణం పేటెంటు హక్కులు అనే రక్షణ వ్యవస్థ భారత గిరిజన, జానపదులకు లేకపోవడమే. అంతర్జాతీయ రౌడీయిజం చేయగలిగిన అమెరికాకున్న శక్తి ఉంటేనే కానీ వీటిని పెద్దస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేము. కనుకనే ఇవి ఇంకా జానపదుల్లో నిలిచి ఉన్నాయి. పచ్చకామెర్లు, ఆస్తమా, బిపి, సుగర్, ఫాటీలివర్ వంటి రోగాలకు ఆంగ్లంలో నేటికీ వైద్యాలులేవు. ఆయుర్వేద, జానపద, గిరిజనుల్లో వైద్యాలున్నాయి. అయితే అమెరికా కంపెనీలు తమ మందులు అమ్ముకోవడానికి ఆయుర్వేదాది మందులను అణగదొక్కుతున్నాయి.
నేటి భారతీయ ఆయుర్వేద మేధావుల పరిస్థితి ఏమిటో తెలుసుకుంటే రక్తం ఉడికిపోతుంది…..
ఒక మందును ఆయుర్వేదంలో అభివృద్ధి చేసి దాన్ని అమెరికా ఫార్మా కంపెనీ పక్కలో పొడుకోపెడితేనే అది మందు అవుతుంది. లేకపోతే అది మందు కాదు. పెరట్లో మొక్కతో ఆయుర్వేద మందు అనే కూతురుకి జన్మనిచ్చి, దానికి నాణ్యమైన మందు అనే ముద్ర వచ్చి విదేశీ సంబంధంతో పెళ్లి కావాలంటే, అమెరికా ఫార్మ రంగం పక్కలో దాన్ని తార్చాలి. అప్పుడు అంతర్జాతీయ ఫార్మారౌడీ ఆ ఆయుర్వేదమందు అనే కన్యను ఏంచేయాలో అది చేసి తన ఉంపుడు గత్తె చేసుకొని తాను ఎక్కడికి పొమ్మంటే అక్కడిపోయే ( ఆ మందు ఏదేశంలో అమ్ముకోవాలో నిర్ణయించి) బజారు వేశ్య చేసి సంపాదించుకొంటాడు. ఇదీ నేటి ఆయుర్వేద వైద్యపరిశోధకుల పరిస్థితి. అంటే అమ్మాయిల బ్రోకర్ కన్నా తక్కువ. కూతుర్ని కని పెంచి తార్చడం వంటిది.
ఈ భయంకరమైన వైద్య విషసర్పకోరలతో ప్రపంచాన్ని చుట్టడానికి శతాబ్దాల పథకం ఆంగ్లేయుడు వేశాడు. దానికి ఆయుర్వేదం అడ్డు కావడంతో దాన్ని మట్టుపెట్టాడు.
ఆయుర్వేదాన్ని నాశనం చేయాలంటే ముందుగా భారతీయులు దైవంగా పెంచుకొనే వృక్షజాతుల్ని నాశనం చేయాలి. కనుక ఒక్కో చెట్టునూ లక్ష్యం చేసుకొని ఒక్కో కుట్ర చేసి మన నుంచీ దూరం చేశాడు.
అది ఎలా జరిగిందో అర్థం కావాలంటే జమ్మిచెట్లు ఎందుకు అంతరిస్తున్నాయో తెలుసుకోవాలి.
నిజానికి ఆయుర్వేదంలో మాత్రమే జమ్మిచెట్టు ముఖ్యమైంది కాదు. ఇది మతపరంగా కూడా చాలా ముఖ్యమైన చెట్టు. ఇంకా చెప్పాలంటే ఆర్థిక శాస్త్రంలో కూడా జమ్మి చెట్టు ముఖ్యమైంది. మహాశ్చర్యకరంగా వ్యవసాయంలో కూడా జమ్మి అతి ముఖ్యమైంది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఇన్ని కోణాల్లో ముఖ్యమైన చెట్టు భారతదేశంలో మరొకటి లేదనే చెప్పాలి. ఇంత ముఖ్యమైన జమ్మిచెట్టును భారతీయులకు ఎలా దూరంచేశారో తెలుసుకుంటే కడుపు తరుక్కుపోతుంది.
శివకేశవులు ఇద్దరికీ అత్యంతప్రీతికరమైనది. వినాయకుడి పత్రిలో అతి ముఖ్యమైంది జమ్మి. అతిముఖ్యమైన దసరాపండుగకు మూలం ఈ జమ్మిచెట్టు. వేదాల నుంచీ పల్లె, గిరిజనుల జీవనాల్లో ఇంతగా పెనవేసుకుపోయిన జమ్మి చెట్టును ఆంగ్లేయులు ఎలా దూరం చేశారో తెలుసుకొంటే తెల్లవారు ఎంత కిరాతకులో తెలుస్తుంది. దీనికి మించి మన సెక్యులర్ నేతలు అమ్మాయిల బ్రోకర్లకన్నా ఎంత నీచులో తెలుస్తుంది.
అది ముందుముందు తెలుసుకొందాం.
ఏలూరిపాటి వెంకట రాజ సుబ్రహ్మణ్యం
ప్రత్యామ్నాయ మాధ్యమ పాత్రికేయ నిపుణుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *