అయ్యప్ప స్వామి కాళ్లను ఎవరు బంధించారు?

0
71

శబరిమలలో కొలువైన అయ్యప్పస్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి. ఆ దివ్య స్వరూపాన్ని దర్శించుకోవడమే పుణ్యఫలం. అయ్యప్ప స్వామివారు జ్ఞాన పీఠంపై కూర్చుని భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఇతర దేవతల్లా కాకుండా అయ్యప్ప స్వామి యోగాసనంలో కూర్చుని భక్తులను తరింపచేస్తుంటారు. స్వామి ఈ విధంగా ఎందుకు కూర్చుకున్నారు అనే విషయం చాలా మందికి తెలియదు. స్వామివారి మోకాళ్లు చుట్టూ ఉందే బంధం ఏమిటి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం… స్వామి వారిని చుట్టి ఉండే బంధాన్ని పట్టు బంధనం అంటారు. అయ్యప్ప స్వామి చిన్నతనంలో పందళరాజు వద్ద పెరిగిన సంగతి మనకు తెలిసిందే. ఆయన్ని అయ్యప్పకు తండ్రి గా భావిస్తుంటారు. ఆయనే అయ్యప్పకు పట్టు బంధనం వేశారట.
అయ్యప్ప స్వామి మానవరూపంలో మణికంఠుడనే పేరుతో పందళరాజు వద్ద పన్నెండు సంవత్సరాలు పెరిగారు. ఆసయంలో నారద మహర్షి వచ్చి మణికంఠడుకి సత్యాన్ని ఉపదేశిస్తాడు. హరిహరసుతుడైన తాను ధర్మాన్ని నిలపడం కోసం, దుష్ట సంహారంకోసం మనవరూపంలో జన్మించిన సంగతిని తెలుసుకున్న అయ్యప్ప లోకకళ్యాణం కోసం మహీషిని వధించిన తరువాత శబరిమల ఆలయంలో చిన్ముద్ర తో యోగాసన పద్దతిలో కూర్చుంటాడు. అయ్యప్ప స్వామి ధర్శనం కోసం పందళరాజు పద్దెమిది మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తాడు. తన దర్శనానికి తండ్రి పందళరాజు రావడంతోనే అయ్యప్ప స్వామి గౌరవసూచకంగా లేచి నిల్చునే ప్రయత్నం చేయడంతో ఆ ప్రయత్నాన్ని వారిస్తూ పందళరాజు తన బుజం మీద ఉన్న పట్టు వస్త్రంతో స్వామివారి రెండు కాళ్లను బంధిస్తారు. దీన్నే పట్టుబంధం అంటారు. అయ్యప్ప స్వామి యోగదీక్షలో ఉన్న రూపు పందళరాజుకు నచ్చి అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన వారందరికీ ఇదే రూపులో దర్శన భాగ్యం కలిగించాలని వేడుకుంటాడు. తనను 12 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచిన పండళరాజు కోరికను మన్నించిన అయ్యప్ప స్వామి నాటి నుండి ఇదే రూపులో భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు.
శివ కేశవులకు తేడా లేదని అంటారు. ఇద్దరూ ఒకటేనని చెప్తూ వారిద్దరి ఐక్యతకు చిహ్నంగా కూడా అయ్యప్ప పట్టుబందాన్ని చూపుతుంటారు.
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here