అందరూ చూస్తుండగానే నరికి చంపారు

0
89
attapur

attapur murder పట్టపగలు…వాహనాల, జనాలతో కిక్కిరిసి ఉన్న అత్తాపూర్ నడిరోడ్డుపై ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా అందరూ చూస్తుండగానే గొడ్డలితో నరికిచంపారు. స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఏమాత్రం జంకకుంటూ తమ పనికానిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న తరువాత కూడా వారికి ఏమాత్రం భయపడకుండా అతి దారుణంగా ప్రత్యర్థిని చంపేశారు. స్థానికులు ఈ దారుణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ హంతకులను నిలువరించడానికి చెసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఒక పోలీస్ పెట్రోలింగ్ వాహనం మాత్రం హంతకులను దాడుకుంటూ వెళ్లిపోవడం స్థానికులు తీసిన వీడియోలో రికార్డయింది….
రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 143 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని సిద్దీ అంబర్ బజార్ కు చెందిన రమేష్ (35)గా గుర్తించారు. హతుడు ఓ హత్యకేసులో నిందితుడు. ఉప్పరపల్లి కోర్టుకు హాజరై ఆటోలో తిరిగి వస్తుండగా మాటువేసిన ప్రత్యర్థులు వెంబడించి నరికి చంపారు. ప్రత్యర్థులు దాడి చేయడంతో రమేష్ ఆటోదిగి పారిపోతుండగా వెంబడించి గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చారు.
మహేశ్ అనే యువకుడి హత్యకేసులో రమేశ్ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో అరెస్టయిన రమేష్ బెయిల్ పై ఉన్నాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కసితోనే మహేశ్ ను రమేష్ హతమార్చినట్టు పోలీసులు చెప్తున్నారు. తన కుమారుడిని హత్యచేసిన రమేష్ పై కక్షపెంచుకున్న మహేశ్ బంధువులు ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. మహేశ్ తండ్రితో పాటుగా అతని సమీప బంధువు ఈ హత్యకు పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం.

ప్రమోషన్లలో రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు


వీటికి ఆధార్ కార్డు తప్పని సరి

Wanna Share it with loved ones?