7న హుస్నాబాద్ లో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ

0
101
ఆశీర్వాద సభ

హైదరాబాద్ శివార్లలోని కొంగర్ కలాన్ లో ప్రగతి నివేదన సభ తరువాత ఈ నెల 7వ తేదీన హుస్నాబాద్ లో మరో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల మధ్య టీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభ ప్రాధాన్యం సంతరించుకుంది. 6వ తేదీన మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దు దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతున్న సమయంలో 7వతేదీన హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు “ప్రజల ఆశీర్వాద సభ” గా పేరు పెట్టినట్టు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. హుస్నాబాద్ సభ ఏర్పాట్లను హరీశ్ రావు తలెకెత్తుకున్నారు.
హుస్నాబాద్ లో టీఆర్ఎస్ నిర్వహించిన సభా స్థలాన్ని మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ లు పరిశీలించారు. అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడారు. నాగులు సంవత్సరాల్లో టీఆర్ఎస్ చేసిన అభివృద్ది కార్యక్రమాలను ఈ సభ ద్వారా ప్రజలకు వివరించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల్లో 100 బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన సంక్షేమ పథకాలను గురించి ఆయా సభల్లో ప్రజలకు వివరిస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు. హుస్నాబాద్ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని, సభకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేపట్టలేదని హరీశ్ రావు పేర్కొన్నారు.
ashirvada sabha, trs meeting, telangana, telangana cm, telangana party, trs meeting husnabad, husnabad.

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరిని దోషుగా ప్రకటించిన కోర్ట్


టీఆర్ఎస్ సభ హిట్టా…? ఫట్టా…?

Wanna Share it with loved ones?