టీచర్ల వికృత చేష్టలు…

0
57

చదువు చెప్పడంతో పాటుగా విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడిల్సిన ఉపాధ్యాయులే వికృతంగా ప్రవర్తించారు. ఆరు, ఏడో తరగతులు చదువుతున్న బాలికల గుడ్డవిప్పించి అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఘటన అరుణాచల్ ప్రదేశ్ లో జరిగింది. మారుమూల ప్రాంతంలో ఈ అమానుషం చోటు చేసుకోవడంతో దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. స్థానిక పాఠశాల విద్యార్థుల కథనం ప్రకారం. అరుణాచల్ ప్రదేశ్ లోని పపుమ్ పరే జిల్లాలోని కస్తూరీభా బాలికల పాఠశాలలో చదివే విద్యార్థినుల బట్టలు విప్పించి వారికి శిక్ష వేశారు. సదరు పాఠశాలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయునిడిని దూషిస్తూ ఒక లేఖ దొరికింది. ఆ లేఖను ఎవరు రాశారో చెప్పాలంటూ 6,7 తరగతులు చదువుతున్న విద్యార్థులను ప్రశ్నించారు. అయితే ఎవరూ ఆ విషయం తమకు తెలియదని చెప్పడంతో మొత్తం 88 మంది బాలికల గుడ్డలు విప్పించి శిక్షించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఒక జూనియర్ టీచర్ తో పాటుగా ఇద్దరు అసిస్టేంట్ టీచర్లు ఈ ఘటనకు పాల్పడినట్టుగా గుర్తించిన అధికారులు వారిపై చర్యకు సిద్ధపడుతున్నారు. బాలల హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరించిన వారిపై కఠినంగా శిక్షించాలని పలువుర డిమాండ్ చేస్తున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here