కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకీ పడుతుంది:బాబు

ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బడ్జెట్ పై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో మాత్రమే తాను మాట్లుడుతున్నానని చెప్పారు. మిత్ర పక్షం కాబట్టే సంయవనంతో మాట్లాడుతున్నానని లేకుంటే పరిస్థితి మరోలా ఉండేందని చంద్రబాబు నాయుడు చెప్పారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను, నిధులను ఇవ్వాలని కోరుతున్నాము తప్ప అదనంగా ఏమీలేదన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. కేంద్రం ఏపీకి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినట్టుగా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో జరిగిన అన్యాయాన్ని బీజేపీ నేతలు కేంద్రం వద్ద ఎందుకు ప్రస్తావించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీతో వాదనలకు దిగే బదులు రాష్ట్రానికి రావాల్సిన నిధులను గురించి తమ అధిష్టానం వద్ద పోరాటం చేయాలని సూచించారు.
తమది ప్రజల పక్షలమని ప్రజల కోసమే తాను పనిచేస్తానని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని పణంగా పెట్టబోనని చెప్పారు. ప్రజల కోసం పోరాడేందుకు ఎంత దూరం పోయేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *