ఏపీలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా?

దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అస్థిత్వంకోసం పోరాడిల్సిన స్థితికి చేరుకుంది. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెల్చుకోలేని దయనీయ స్థితిలో పడిపోయింది. ఇక ఎంపీల గురించి చెప్పాల్సిన పనేలేదు. రాష్ట్ర విభజన సమయంలోనే హాస్తం పార్టీకి చెందిన హేమాహేమీ నాయకులు వలసబాట పట్టారు. సాక్షాత్తూ నాటి ముఖ్యమంత్రి తో సహా ఇతర పేరున్న నాయకులు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఎన్నికల తరువాత కూడా ఆ పార్టీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేదు. చెప్పకోదగ్గ నాయకులు లేరు. ఉన్న నాయకులు కూడా కేవలం నామమాత్రంగానే మిగిలిపోయారు. కార్యకర్తల పరిస్థితి అయితే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. చెట్టుకోకరు, పుట్టకొకరుగా మిగిలిపోయారు.
ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మేమున్నాం అని చెప్పుకునే స్థాయికి తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తోంది పార్టీ అధినాకత్వం. ఈ తెలుగు రాష్ట్రంపై దృష్టిపెట్టి పార్టీని వీడిపోయిన నాయకులను తిరిగి తమవైపు తిప్పుకునే పనిలో పడింది. ప్రస్తుతం ఇతర పార్టీల్లో సరైన పదవులు లేని వారిని, రాజకీయాలకు దూరంగా ఉన్న వారిని తిరిగి పార్టీలోకి తీసుకుని రావడంద్వారా కొద్దిగా నైనా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోయాలని పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సొంతగూటిలోకి ఆహ్వానిస్తున్నారు. మంచి వాగ్ధాటి ఉన్న నేతగా కిరణ్ కుమార్ రెడ్డి పేరుంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి పార్టీని విడిచిపెట్టి సొంత కుంపటి పెట్టుకున్న కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ దారుణంగా విఫలమైంది. ఆయనే తన స్వంత నియోజకవర్గం నుండి గెలవలేకపోయారు. నాటి నుండి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన్ను తిరిగి పార్టీలో చేర్చుకోవడంతో పాటుగా మరికొంతమందిని పాత కాపులను రప్పించుకునే పనిలో పార్టీ పెద్దలు ఉన్నట్టు సమాచారం.
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీనే కారణం అనే ఆగ్రహం ఏపీ ప్రజల్లో బలంగా నాటుకునిపోయింది. దీనితో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలనే ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ప్రజల్లో కనీస మద్దతు కరువుకావడంతో ఆ పార్టీ నామమాత్రంగానే మిగిలిపోయింది. అయితే టీడీపీ-బీజేపీల మధ్య వైరం. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందనే టీడీపీ ప్రచారంతో హస్తం నేతల ఆశలు కొద్దిగా చిగురించాయి. హోదా కోసం టీడీపీ ఢిల్లీలో చేసిన పోరాటానికి ఆ పార్టీ మద్దతు ప్రకటించింది. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంటనే ఇస్తాంటూ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రజల్లోకి బలంగా తీసుకునిపోయేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.
టీడీపీ-బీజేపీల వైరంతో పాటుగా వైసీపీ బీజేపీకి దగ్గరవుతోందనే ప్రచారం. జనసేన అధినేత అధికార పార్టీపై చేస్తున్న విమర్శలు తదితర అంశాలనూ బేరూజు వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి రాష్ట్రంలో చక్రం తిప్పాలనే ప్రయత్నాలను గట్టిగానే చేస్తోంది. దేశంలో బీజేపీని గద్దే దింపే సత్తా ఉన్న ఏకైక పార్టీ తమదేనని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రచారం చేయడం ద్వారా ఏపీ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ గట్టిగానే చేస్తోంది. ఏపీలో తిరిగి నిలబడాలనుకునే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
congress party, apccc, ap congress, andhra pradesh, andhra pradesh congress party, rahul gandhi, raghuveera reddy, kiran kumar reddy, congress leaders.

వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం: ఉత్తమ్ కుమార్ రెడ్డి


కరీమాబాద్ చేరుకున్న శరత్ మృతదేహం
Indian_National_Congress