అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా:రాహుల్ గాంధీ

0
17
andhra pradesh congress

andhra pradesh congress కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కర్నూల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన విద్యార్థులతో ముఖాముఖీ మాట్లాడారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ తమ పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా విషయమై స్పష్టమైన హామీ ఇచ్చారని లోక్ సభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీలను నిలబెట్టాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పై ఉందన్నారు.
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కని దాన్ని కాదనే అధికారం ఎవరికీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. మాట మీద నిలబడే అలవాటు మోడీకి లేదన్న రాహుల్ దేశ ప్రజలందరితో పాటుగా ఏపీ ప్రజలనూ మోడీ దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. చట్ట సభల్లో ప్రధాని మంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అంటే చట్టసభలకు గౌరవం ఇవ్వకపోవడమేనని రాహుల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యువత నిరాశ,నిస్పృహలతో ఉందన్నారు. ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని రాహుల్ విమర్శించారు. చైనా ప్రతీ రోజుకి 50వేల ఉద్యోగాలను సృస్టిస్తోందని అదే సమయంలో మన దేశం కేవలం 450 ఉద్యోగాలు మాత్రమే సృష్టిస్తోందని చెప్పారు.
దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో మోడీ సర్కారు దేన్నీ నెరవేర్చలేదని అన్నారు. అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిందని, నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల చిరువ్యాపారుల దెబ్బతిన్నారని రాహుల్ చెప్పారు. పెద్ద నోట్లను రద్ద చేయడం ద్వారా ఏం సాధించారో మోడీ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
rahul gandhi, rahul, kurnool, congress party, andhra pradesh, andhra pradesh congress.
నల్గొండ అసెంబ్లీ అభ్యర్థిని మార్చాలి-చకిలం అనీల్ వర్గీయుల డిమాండ్

Wanna Share it with loved ones?