అవినీతి ఆరోపణల్ని ఖండించిన అమిత్ షా

తన కుమారుడు జై షా కు చెందిన కంపెనీలో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఇందులో ఎటువంటి కుంభకోణం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అమిత్ షా కుమారుడికి చెందిన కంపెనీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత విపరీతంమైన లాభాలను ఆర్జించిందని బీజేపీ అధికారంలోకి రాకముందు వేలల్లో ఉన్న టర్నోవర్ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 80కోట్లకు చేరుకోవడంపై ఒక వెబ్ సైట్ ప్రచురించిన కథనం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. అమిత్ షా కుమారుడికి చెందిన కంపెనీపై విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయితే రాజకీయ కుట్రలతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. తన కుమారిడికి చెందిన కంపెనీకి ప్రభుత్వం నుండి ఎటువంటి భూమి లేదా కాంట్రాక్టులు రాలేదని అమిత్ షా స్పష్టం చేశారు.
అవినీతి ఆరోపణల్లో పూర్తిగా మునిగిపోయిన కాంగ్రెస్ తన పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. తన కుమారుడికి చెందిన కంపెనీ ప్రభుత్వం ద్వారా ఎటువంటి లబ్దీ పొందలేదని దీనిపై విచారణ జరుపుకోవచ్చని అమిత్ షా పేర్కొన్నారు. జై షాకి చెందిన కంపెనీపై అసత్య కథనాన్ని ప్రచురించిన వెబ్ సైట్ పై పరువునష్టం దావా కూడా వేసినట్టు అమిత్ షా వెల్లడించారు. రాజకీయంగా తమని ఎదుర్కోలేక ఇటువంటి అబ్బద్దపు ప్రచారాలకు దిగుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ఎటువంటి అవినీతి మరక లేని తమ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ లాభం పొందేెందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని అమిత్ షా అన్నారు.
అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం అమిత్ షా తనయుడి కంపెనీకి సంబంధించిన వ్యవహారలపై పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సదరు కంపెనీ కోట్లాది రూపాయల టర్నోవర్ ను ఎట్లా సాధించినందని వారు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *