అమిత్ షా కాన్వాయ్ పై దాడి

0
109
అమిత్ షా పై తిరుపతిలో దాడి
bjp national president amit shah

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై తిరుపతిలో రాళ్లదాడి జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నిరసనకారులు ఆయన కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అమిత్ షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిరసనకారుల్లో కొందరు ఆయన కాన్వాయ్ పై చెప్పులు విరిసినట్టు తెలుస్తోంది. ఒక నిరసనకారుడు విసిరిన రాయి అమిత్ షా వాహానానికి వెనకాల ఉన్న కారుపై పడింది. దీనితో కారు అద్దాలు పగిలిపోయాయి. రాయి విసిరిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన అమిత్ షా దైవదర్శనం తరువాత తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అలిపిరి వద్ద గుమిగూడిన నిరసనకారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తుండగానే అందులో కొందరు రాయివిసిరిన ఘటన అక్కడ ఒక్కసారిగా ఉధ్రిక్తతను రేపింది. అమిత్ షా వెంట ఉన్న బీజేపీ కార్యకర్తలు నిరసనకారులపైకి దూసుకునిపోవడంతో పరిస్థితి మరింత ఉధ్రిక్తంగా మారింది. దీనితో పోలీసులు సకాలంలో స్పందించి ఇరువర్గాలను నిలువరించారు. స్వల్పంగా లాఠీచార్జీచేసిన అక్కడనున్న వారిని తరిమికొట్టారు.
అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లదాడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా రాజకీయ వేడిని రగిల్చింది. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతవహించాలని బీజేపీ నేతలు అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ అధ్యక్షుడికే భద్రత కల్పించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే తమ అధ్యక్షుడిపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో అమాయక ప్రజలను టీడీపీ రెచ్చగొడుతోందని అన్నారు.తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిపై జరిగిన దాడిపై పూర్తి విచారణ జరపాలని, ఇందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీజీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
స్పందించిన ముఖ్యమంత్రి:
అమిత్ షా కాన్వాయ్ పై దాడి జరగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు సంయవనం పాటించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. హోదా కోసం జరుగుతున్న పోరాటంలో హింసకు తావులేదన్నారు. ప్రశాంతంగా నిరసనను తెలియజేయాలి తప్ప ఇటువంటి దాడులుకు పాల్పడవద్దని చంద్రబాబు హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అమిత్ షా కారుపై రాయిపడలేదని ఆయన కాన్వాయ్ లో ఉన్న ఒక వాహనం పై మాత్రమే పడిందని ఏపీ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తామన్నారు. బీజేపీ కార్యకర్తల్లో కొంతమంది రెచ్చగొట్టడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
బీజేపీ నేతల వల్లే అమిత్ షా పై దాడిజరిగిందని మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తెలుగు ప్రజలను బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారని వారి వ్యాఖ్యల వల్లే పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం తలెత్తిందన్నారు. తెలుగు ప్రజలను మోసం చేసిన బీజేపీ తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం టీడీపీపై బురదజల్లుతోందన్నారు.
tirumala, tirumathi, attack on bjp president,attack on amit shah , tdp activities attacked on amit shah, bjp, tdp vs bjp, heat between bjp vs tdp, political heat in ap.

సినీ నటి శ్రీదేవి మరణంపై పిటీషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు


telangana-police/
Amit_Shah

Wanna Share it with loved ones?