టీఆర్ఎస్ కు ఓటమీ భయం పట్టుకుంది : అమిత్ షా

పాలమూరు వేదికగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అతిత్ షా టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకోసమే ముందస్తు ఎన్నికలకో కోసం అసెంబ్లీని రద్దు చేశారని అమిత్ షా విరుచుకని పడ్డారు. పాలమూరులోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
* అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో కేసీఆర్ చెప్పాలి.
* ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన జమిలి ఎన్నికలకు మద్దతు ప్రకటించిన కేసీఆర్ ఎందుకు మనసు మార్చుకున్నారు.
* ఓటమి భయం కేసీఆర్ ను వెన్నాడుతోంది.
* కేసీఆర్ ఓవైసీకి భయపడుతున్నారు.
* ఓవైసీకి భయపడే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు.
* సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదో కేసీఆర్ ప్రజలకు చెప్పాలి.
* ఓవైసీకి భయపడే కేసీఆర్ తెంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడతానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు.
* తెలంగాణలో బీజేపీ భారీ విజయాన్ని సాధిస్తుంది.
* రాహుల్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.
* కలలు కనడం రాహుల్ కు అలవాటుగా మారింది.
* పగలు, రాత్రి తేడా లేకుండా రాహుల్ కలలు కంటూనే ఉంటాడు.
* వాస్తవాలను పట్టించుకునే స్థితిలో రాహుల్ లేడు.
* దేశంలో ఏం జరుగుతుందో రాహుల్ కు పట్టదు.
* బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో జరిగిన అభివృద్ధిని రాహుల్ చూడలేకపోతున్నాడు.
* దేశవ్యాప్తంగా వచ్చిన మార్పును చూసే ధైర్యం రాహుల్ కు లేదు.
* తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
* కేంద్రంలో తిరిగి బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయం.
* తెలంగాణకు చెందిన సొంత పార్టీ నేతలనే కాంగ్రెస్ పార్టీ అవమానించింది.
* మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్యను, మాజీ ప్రధాని పీ.వీ.నరసింహా రావును కాంగ్రెస్ పార్టీ ఎంత అవమానించిందో తెలంగాణ ప్రజలకు తెలుసు.
* బీజేపీ సభను విజయం వంతం చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు
* పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలి.
* రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుంది.
* టీఆర్ఎస్ సర్కారు అన్ని విధాలుగా విఫలం అయింది.
* కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడుతున్నారు.
* రాజ్యంగం మతపర రిజర్వేషన్లను అనుమతించకున్నా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు అంటూ కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారు.
* టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ఓటు బ్యాంకు రాజకీయాలు మరింత ఎక్కువ అవుతాయి.
* కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు భారీ నిధిలు ఇస్తోంది.
* తెలంగాణను కేంద్రం అన్ని విధాలుగా అభివృద్ది చేస్తోంది.
bjp, telangana, telangana bjp, Amit Shah.

సర్జికల్ స్ట్రైక్స్ పై అశక్తికర విషయాన్ని చెప్పిన కమాండర్