పోలీసుల ఎదుట లొంగిపోయిన అమలాపాల్

ప్రముఖ సినీ నటి అమలాపాల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆమె అక్కడ పోలీసుల ఎదుట తాను లొంగిపోతున్నట్టు చెప్పారు. పన్ను ఎగవేత కేసులో అమలాపాల్ పై 430,468,471 సెక్షన్ ల కింద కేసులు నమోదయ్యాయి. దీనితో ముందస్తు బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న ధరఖాస్తును విచారించిన కోర్టు ముందుగా క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనితో అమలాపాల్ తన లాయర్ తో పోలీస్ స్టేషన్ కు వచ్చారు. కోటి రూపాయల ఖరీదు చేసే కారును కొన్న అమలాపాల్ దాన్ని పాండిచ్చేరీలో రిజిస్టేషన్ చేయించారు. దీని కోసం గాను తప్పుడు ద్రువీకరణ పత్రాలను సమర్పించారు.
కేరళలో పన్నును ఎగవేసే ఉద్దేశంతోనే తప్పుడు పత్రాలను సృష్టించడం ద్వారా మోసానికి పాల్పడ్డారంటూ అమలాపాల్ పై కేసు నమోదయింది. దీనితో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు ఆదేశించడంతో క్రైమ్ బ్రాంచ్ ఎదుట లొంగిపోక తప్పలేదు. పోలీసుల ఎదుట తాను తప్పుచేసినట్టు అమలా పాల్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులను కలిసిన తరువాత అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న మీడియాతో మాట్లాడకుండానే అమలాపాల్ వెనుతిరిగారు.