నేనే తప్పు చేయలేదు: అమలా పాల్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోటి రూపాయలకు పైగా ఆదాయపుపన్నును తాను కట్టినట్టు ప్రముఖ నటి అమలా పాల్ చెప్తున్నారు. పన్ను ఎగవేయడం కోసం నకిలీ పత్రాలు చూపించి కోటి రూపాయల విలువ గల కారు కొన్నారంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. పన్ను ఎగ్గొటాల్సిన అవసరం తనకు లేదని తప్పుడు పత్రాలను ఎప్పటికీ తాను చూపించచని నిజాయితీ గల భారతీయురాలిగా ఉండడానికి తాను ఇష్టపడతానంటూ ఆమె పేర్కొన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని చెప్తున్నప్పటికీ తనపై తప్పుడు రాతలు రాస్తూ దుష్పప్రచారం చేస్తున్నారని అమలా పాల్ మండిపడ్డారు. తాను అనేక ప్రాంతీయ చిత్రాల్లో నటిస్తున్నానని ఆయా ప్రాంతాల్లో తాను నటించినందుకు గాను పారితోషకం తీసుకుంటున్నాని అమలా పాల్ చెప్తున్నారు.
తనపై వస్తున్న ఆరోపణలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని ఆమె అంటున్నారు. తాను భారతీయురాలిగా చెప్పుకోవడానికి ఇష్టపడతానని పంజాబీ, గుజరాతీ, తమీళియన్ అన్న పదాలు తనకు రుచించవని ఆమె పేర్కొన్నారు.