సంచలనం రేపుతున్న ఆలియాభట్ వీడియో ట్రైలర్

 
badrinath-ki-dulhania-first-look-varun-dhawan-alia-bhatt
బాలీవుడ్ హాట్ పెయిర్ లలో ఒకటిగా చెప్పుకుంటున్న వరుణ్ ధావన్, అలియాభట్ జంటగా నటించిన చిత్రం “బద్రీనాథ్ కి దుల్హనియా” చిత్రం ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. ఈ చిత్ర ట్రైలర్ ను యూట్యూబ్ లో ఉంచిన 12 గంటల్లోనే 50 లక్షల మంది ఈ వీడియోను చూశారు. ” స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్” ” హంస్టీ శర్మకీ దుల్హనియా” చిత్రాలతో స్టార్ పెయిర్ గా మారిన ఈ జంట నటించిన కొత్త చిత్రానికి ప్రేక్షుల నుండి వచ్చిన ఆదరణ చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తన చిత్రానికి ఇంత పెద్ద మొత్తంలో స్పందన రావడం పట్ల ఆలియా భట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యావాదాలంటూ స్పందించారు. తాను నటించిన చిత్రం ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో రెండవ స్థానంలో ఉండడం ఆనందంగా ఉందని అన్న ఆలియాభట్ తమ చిత్రం కూడా భారీ హిట్ అవుతుందని చెప్తోంది.  “బద్రీనాథ్ కి దుల్హనియా” చిత్రనాన్ని మార్చి 10వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *