కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ చర్చలు

0
78
అఖిలేష్ యాదవ్
up ex cm akhilesh yadav

బీజేపీ-కాంగ్రెస్ యేతర శక్తులను ఏకతాటిపైకి తీసుకుని వచ్చే పనిలో బిజీనీగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీపార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. లక్నో నుండి బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన అఖిలేష్ కు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు స్వాగతం పలికి ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ కు తీసుకుని వచ్చారు.
ప్రగతీ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలేష్ తో సహా ఆయన బృందానికి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ కు చెందిన ముఖ్యనాయకులు కూడా ఈ విందుకు హాజరయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, అఖిలేష్ యాదవ్ లు రాజకీయాలపై ప్రత్యేకంగా చర్చించుకున్నారు. బీజేపీ-కాంగ్రెస్ లకు సమదూరం పాటిస్తూ దేశంలో మూడో ప్రత్యామ్నాయ శక్తులను ఏకంచేయడమే లక్షంగా సాగుతున్న కేసీఆర్ ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం అయ్యారు.
ఇటీవల మంత్రి కేటీఆర్ లక్నోలో అఖిలేష్ యాదవ్ ను కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. దేశ రాజకీయాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించుకున్న తరువాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
దేశ రాజకీయాల్లో భారీ మార్పులు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కావాలని దీనికోసం ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలన్నారు. 2019 ఎన్నికలతో పాటుగా రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లో మరింత క్రియాశీల పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. గత నెలరోజుల్లో చాలా సార్లు అఖిలేష్ తో ఫోన్ లో మాట్లాడినట్టు కేసీఆర్ వెల్లడించారు.
ఫెడరల్ ఫ్రంట్ ను మూడో ప్రత్యామ్నాయంగా అభివర్ణించడాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. తమది మూడో ప్రత్యామ్నాయమో, నాలుగో ప్రత్యామ్నాయమో కాదన్నారు. దేశ ప్రజలు తమ ఫ్రంట్ నే మొదటి ప్రధాన్యతగా గుర్తిస్తారని భరోసా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో మర్పులు వస్తేనే ప్రజలు బాగుపడతారని చెప్పారు.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో సమావేశామైన కేసీఆర్ అటు తర్వాత జార్ఘండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ శోరెన్, మాజీ ప్రధాని దేవగౌడ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిలను కలిసి ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చలు జరిపారు. తొలుత లక్నోలో కేటీఆర్ అఖిలేష్ యాదవ్ ను కలిసి రాగా ప్రస్తుతం ఆయన హైదరాబాద్ కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరిపారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో జట్టుకట్టిన సమాజ్ వాదీ పార్టీ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఈ దశగా కేసీఆర్ అఖిలేష్ తో జరిపిన చర్చలు ప్రధాన్యం సంతరించుకున్నాయి. ఇటు వామపక్షాలు కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తున్నారని సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే.
akhilesh yadav , samajwadi party, kcr, trs, federal front, cm kcr met with akhilesh yadav, uttar pradesh, uttar pradesh ex cm.

మరో సారి తెరమీదికి యునైటెడ్ ఫ్రంట్ | United Front again?


dignity-of-labour/
Akhilesh_Yadav
Chief_Ministers_of_Uttar_Pradesh
Uttar_Pradesh


Wanna Share it with loved ones?