పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పై ఆదేశపు క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ మరోసారి విరుచుకుని పడ్డాడు. ప్రస్తుతం తన కెరీర్ ముగిసిందని తాను భావిచడం లేదని అఫ్రీదీ అన్నాడు. తాను 20 సంవత్సరాలుగా అంతర్జాకీయ క్రికెట్ ఆడుతున్నానని తాను ఇప్పటికీ జాతీయ జట్టులో ఆడగల సత్తా ఉందని భావిస్తున్నట్టు చెప్పాడు. తాను దేశం కోసం క్రికెట్ ఆడాను కానీ పారిస్థాన్ క్రికెట్ బోర్డును మెప్పించడానికి కాదన్నారు. వీడ్కోలు మ్యాచ్ కోసమే ఎదురుచూస్తూ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకోవడం లేదంటూ గత కొంతకాలంగా తనపై వస్తున్న వార్తలపై అఫ్రిది స్పందించారు.ఈ ఏడాది ముగిసిన ఆసియా, టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి అఫ్రిది తప్పుకొన్నాడు. అప్పటి నుంచి అఫ్రిదిని సెలక్టర్లు జాతీయ జట్టుకు దూరంగా ఉంచుతున్నారు.